ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి డయాబెటిస్. సరైన సమయంలో డయాబెటిస్ నియంత్రించలేకపోతే..ప్రమాదకరంగా మారుతుంది. మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం రాకుండా ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకసారి డయాబెటిస్ సోకితే.. విముక్తి పొందడం చాలా కష్టం. డయాబెటిస్ ఉన్నప్పుడు జీవనశైలిలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవాలి. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఆహారం విషయంలో నియంత్రణ పాటించి..సరైన డైట్ తీసుకుంటే బ్లడ్ షుగర్ సులభంగా నియంత్రించుకోవచ్చు. కొన్ని విధానాలతో డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే.


బ్లడ్ షుగర్ నియంత్రణకు పాటించాల్సిన చిట్కాలు


దాల్చినచెక్క పౌడర్ డయాబెటిస్ రోగులకు అద్భుతంగా పనిచేస్తుంది. దాల్చినచెక్క ఆరోగ్యానికి చాలా మంచిది. దాల్చినచెక్క టీ కూడా మంచి ఫలితాలిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను సులభంగా నియంత్రించేందుకు దాల్చినచెక్క పౌడర్ మంచి పరిష్కారం.


నేరేడు పండ్లు


మధుమేహం వ్యాధిగ్రస్థులకు నేరేడు పండ్లు చాలా మంచివి. రోజూ నేరేడు విత్తనాలు తీసుకుంటే..డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. దీనికోసం నేరేడు విత్తనాల్ని ముందుగా బాగా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండబెట్టిన తరువాత పౌడర్‌గా చేసుకోవాలి. ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా మూడు వారాలు చేస్తే చాలు..బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో ఉంటుంది.


తులసి ఆకులు


తులసి మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే..తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి చాలా ప్రయోజనకరం. ప్రతిరోజూ ఉదయం పరగడుపున 2-3 తులసి ఆకులు నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.


Also read: Diabetes: మధుమేహ వ్యాధిగ్రస్థులు బంగాళదుంప తినవచ్చా లేదా...వైద్యులు ఏమంటున్నారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook