ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. హార్ట్ ఎటాక్, స్ట్రోక్, మధుమేహం ఇందులో ముఖ్యమైనవి. ప్రాణాంతకమైనవి కూడా. ఈ సమస్యలకు కారణం కొలెస్ట్రాల్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్యం ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు కారణం శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడమే. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ కారణంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు ఎప్పుడూ ఉంటుంది. మరోవైపు డయాబెటిస్‌కు ఇదే కారణమౌతుంటుంది. వాస్తవానికి శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ కాగా రెండవది హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. హెచ్‌డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ పెరిగితే ఎన్నో రకాల వ్యాధులు తలెత్తుతాయి. అసలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే..ఎలా గుర్తించాలి, ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం..


శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కన్పించే లక్షణాలు


బాడీ క్రాంప్స్


శరీరంలోని వివిధ భాగాల్లో తరచూ క్రాంప్స్ వస్తుంటాయి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు నిర్లక్ష్యం ప్రదర్శించకూడదు. ఎందుకంటే శరీరంలో చెండు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కాళ్లు, చేతులు, వివిధ భాగాల్లో క్రాంప్స్ సమస్య తలెత్తుతుంది. ఒక్కోసారి కాస్సేపు ఉండి తగ్గిపోతాయి. ఇలా ఉంటే చెడు కొలెస్ట్రాల్ లక్షణంగా భావించవచ్చు.


నాసియా


చాలా సందర్భాల్లో కొద్దిగా తిన్నా సరే వాంతులు వచ్చేట్టు ఉంటుంది. ఈ సమస్య 1-2 రోజులుందంటే వాతావరణ మార్పుగా భావించవచ్చు. కానీ ఇదే సమస్య తరచూ ఉంటే మాత్రం చెడు కొలెస్ట్రాల్ ఉన్నట్టు అర్ధం చేసుకోవచ్చు.


చెమట్లు పట్టడం


చెమట్లు పట్టడం ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు మంచిదే. కానీ అన్ని సందర్భాల్లో కానేకాదు. సాధారణ ఉష్ణోగ్రతలో ఏవిధమైన వ్యాయామం లేకుండా చెమట్లు పడితే..కొలెస్ట్రాల్ పెరిగిందని అర్దం చేసుకోవచ్చు. మీక్కూడా తరచూ చెమట్లు పడుతూ ఉంటే..కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి ఉండవచ్చు. ఈ పరిస్థితిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.


Also read: Diabetes Tips: రోజూ ఈ జ్యూస్ తాగితే..బ్లడ్ షుగర్, మలబద్ధకం సహా అనేక సమస్యలు మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook