Constipation Tips: ఆహారపు అలవాట్లలో ఏ చిన్న సమస్య వచ్చినా ముందుగా కడుపులో ప్రభావం చూపిస్తుంది. మరోవైపు మల బద్ధకం సమస్య కూడా ఉంటే కచ్చితంగా డైట్‌లో మార్పులు చేయాల్సిందే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తినే ఆహారం సరిగ్గా ఉంటే ఏ విధమైన సమస్య ఉండదు. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా తీవ్రమైన సమస్యలు వస్తుంటాయి. ఇందులో కడుపుకు సంబంధించిన సమస్యలు సర్వ సాధారణం. ఆయిలీ, ఫ్రైడ్ పదార్ధాలు, జంక్ ఫుడ్, ప్రోసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కడుపులో గ్యాస్, ప్రేవుల్లో వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం మరో ప్రధాన సమస్య. కానీ కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువ సేపుంటే..సీరియస్ కావచ్చు. 


మలబద్ధకం నుంచి ఉపశమనం పొందేందుకు వివిధ రకాల చిట్కాలు పాటిస్తుంటారు. కానీ సరైన ఫలితాలు లభించవు. ఈ పరిస్థితుల్లో మల బద్ధకం సమస్య నుంచి విముక్తి పొందేందుకు డైట్‌లో మార్పులు చేయాలి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం..


మలబద్ధకం నుంచి విముక్తి ఎలా


మీకు మలబద్దకం సమస్యగా ఉంటే రాత్రంతా ఓ అరలీటరు నీళ్లను రాగి చెంబులో ఉంచి ఉదయం తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదే సమయంలో మలబద్ధకం సమస్య కూడా పోతుంది. 


తరచూ మలబద్ధకం సమస్య ఉంటే..గోంద్ కతీరా అంటే ట్రాగాకాంత్ గమ్‌ను రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీళ్లను తాగాలి. ఇందులో ఉండే పోషక గుణాలు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.రోజూ తీసుకోవచ్చు.


మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందేందుకు మద్యాహ్నం భోజనానికి అరగంట ముందు మజ్జిగతో పాటు రాత్రంతా నానబెట్టిన చియా సీడ్స్ తీసుకోవాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజూ ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి.


Also read: Kidney Disease Symptoms: కిడ్నీ వ్యాధుల్ని పసిగట్టే 10 ముఖ్యమైన లక్షణాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook