Monsoon Fruits: వర్షాకాలం వ్యాధుల్నించి సంరక్షించుకునేందుకు తీసుకోవల్సిన పదార్ధాలివే
Monsoon Fruits: రోగ నిరోధక శక్తి ఒక్కటే అన్నింటికీ పరిష్కారం. అన్ని రోగాల్నించి రక్షించేది ఇదే. ఇమ్యూనిటీ బాగుంటే ఏ రోగమూ దరిచేరదు. మీ డైట్‌లో ఈ ఆహార పదార్ధాలు చేర్చుకుంటే..అన్ని రోగాలు దూరమౌతాయి..
Monsoon Fruits: రోగ నిరోధక శక్తి ఒక్కటే అన్నింటికీ పరిష్కారం. అన్ని రోగాల్నించి రక్షించేది ఇదే. ఇమ్యూనిటీ బాగుంటే ఏ రోగమూ దరిచేరదు. మీ డైట్‌లో ఈ ఆహార పదార్ధాలు చేర్చుకుంటే..అన్ని రోగాలు దూరమౌతాయి..
మనిషి శరీరానికి ఇమ్యూనిటీ చాలా అవసరం. రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే ఏ విధమైన సమస్యా తలెత్తదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే వివిధ రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం ఒక్కటే మార్గం. వర్షాకాలం వ్యాధుల్నించి రక్షించుకునేందుకు డైట్‌లో కొన్ని మార్పులు అవసరమంటున్నారు వైద్య నిపుణులు. తినే ఆహార పదార్ధాల్లో కొన్ని మార్పుల ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. ఇమ్యూనిటీ పెరిగితే వర్షాకాలంలో ఎదురయ్యే వ్యాధుల్నించి సంరక్షించుకోవచ్చు.
1. వర్షాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉంటే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. వైట్ బ్లడ్ సెల్స్ వృద్ధికి విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి కోసం బత్తాయి, నారింజ, నిమ్మకాయల్ని పుష్కలంగా సేవించాలి. అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి.
2. పాలకూర కూడా వర్షాకాలంలో ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ కారణంగా రోగాల్నించి పోరాడే ఇమ్యూనిటీ వ్యవస్థ బలోపేతమౌతుంది. బ్రోకలీలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్ ఎ ఎక్కువగా లభించే ఇతర కూరగాయలు కూడా తీసుకోవాలి.
3. పసుపు, అల్లంతో అద్భుత ప్రయోజనాలున్నాయి. పసుపును క్రమం తప్పకుండా పాలలో కలిపి తీసుకుంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అదే విధంగా గొంతు సంబంధిత సమస్యలకు అల్లంతో మంచి పరిష్కారముంటుంది.
4. గ్రీన్ టీతో కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్ అనేది ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. గ్రీన్ టీలో ఉండే లిథనైన్ కారణంగా కీటకాల్నించి పోరాడేందుకు దోహదమౌతుంది.
5. కివి ఫ్రూట్‌లో ఫోలెట, పొటాషియం, విటమిన్ కే, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఫలితంగా వైట్ బ్లడ్ సెల్స్ నిర్మాణంలో సహాయపడుతాయి. కివి ఫ్రూట్స్ సేవించడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి.
6. బొప్పాయి విటమిన్ సికు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో పుష్కలంగా లభిస్తుది. బొప్పాయి అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వివిధ రకాల సమస్యల్నించి గట్టెక్కిస్తాయి.
Also read: Weight Loss Tips: పన్నీర్, గుడ్డు కలిపి తింటే బరువు తగ్గుతారా... ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook