Uric Acid Problem: మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి ఎప్పుడూ నియంత్రణలోనే ఉండాలి. ఆ పరిమితి పెరిగితే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. యూరిక్ యాసిడ్ ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీకు గానీ మీ ఇంట్లో కుటుంబసభ్యులకు గానీ..కీళ్ల నొప్పులుంటున్నాయా..లేదా కాలి వేళ్లు, మడమ, మోకాళ్లలో నొప్పి ఉంటోందా..ఇలాంటి లక్షణాలు కన్పిస్తే మాత్రం అప్రమత్తమవ్వాల్సిందే. ఈ లక్షణాలన్నీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం వల్ల వస్తుంది. మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి 7mg/dl కంటే ఎక్కువుంటే..ప్రమాదకరమని అర్ధం. యూరిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో ఉంటే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి, ఎలా తగ్గించాలి, యూరిక్ యాసిడ్ నియంత్రించేందుకు ఎలాంటి డైట్ తీసుకోవాలనేది పరిశీలిద్దాం..


గౌట్ ఆర్ధరైటిస్ అనేది అన్నింటికంటే నొప్పిగా ఉంటుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోయినప్పుడు ఉంటుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారపదార్ధాల్లో మార్పులు చేయడమే యూరిక్ యాసిడ్ నియంత్రణకు అత్యుత్తమ మార్గం. జీవనశైలిలో మార్పులు, తరచూ మందులు వాడటం వల్ల తగ్గించుకోవచ్చు.


కొన్ని రకాల ఆహార పదార్ధాల వల్ల యూరిక్ యాసిడ్ పేరుకుపోతుంది. కొందరికైతే ఇది వంశపారంపర్యంగా వస్తుంది. అంటే కుటుంబంలో ఎవరికైనా ఉంటే మీకు కూడా వచ్చే అవకాశముంది. స్థూలకాయం లేదా కడుపుకు అటూ ఇటూ కొవ్వు పేరుకుపోవడం కూడా యూరిక్ యాసిడ్ కారణం. మీరు తరచూ ఆందోళన లేదా ఒత్తిడికి లోనవుతుంటే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతుంది. 


యూరిక్ యాసిడ్ బాధితులు మష్రూమ్, బీన్స్, మటర్, పప్పులు, అరటిపండ్లు, అవకాడో, కివీ ఫ్రూట్, దానిమ్మను సాధ్యమైనంతవరకూ తగ్గించాలి. మీరు తీసుకునే డైట్‌లో ఫ్యాట్ లేకుండా చూసుకోవాలి. ఫ్రైడ్ ఆహార పదార్ధాలు పూర్తిగా తగ్గించాలి. ముఖ్యంగా శాచ్యురేటెడ్ ఫ్యాట్‌కు దూరంగా ఉండాలి. 


యూరిక్ యాసిడ్ సమస్య నుంచి గట్టెక్కేందుకు మీ డైట్‌లో కొన్ని ఆహార పదార్ధాలు చేర్చాల్సి ఉంటుంది. అందులో యాపిల్ సైడర్ వెనిగర్, ఫ్రెంచ్ బీన్స్ జ్యూస్, చెర్రీ, నేరేడు పండ్లు,  లోఫ్యాట్ డైరీ ఉత్పత్తులు, ఎక్కువగా నీరు, ఆలివ్ ఆయిల్ , పింటో బీన్స్ డైట్‌లో చేర్చడం ద్వారా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.


Also read: Diabetes Control Tips: మునగ ఆకు కూరను వారానికి ఒక్క సారి తింటే.. జన్మలో మధుమేహం రాదు..!



 స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook