రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వినియోగిస్తున్నా..ఇటీవలి కాలంలో అన్ని ప్రాంతాల్లో విస్తరించింది. రాగుల్లో ఉండే పోషక పదార్దాలు అంతులేని లాభాలు చేకూరుస్తాయి. రాగులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. ప్రతి వంటింట్లో లభించే ఆహార పదార్ధాలతో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. ఇటీవలి కాలంలో రాగులకు ప్రాచుర్యం బాగా పెరిగింది. కారణం ఇందులో విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. 


రాగుల్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. వేసవిలో రాగి జావ ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే..చలవ చేస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలసట తగ్గుతుంది. మరీ ముఖ్యంగా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రాగుల్లో పుష్కలంగా ఉండే ఫైబర్ కారణంగా గ్లైసీమియా షుగర్ వ్యాధిగ్రస్థులకు ప్రయోజనం కలుగుతుంది. 
 
కేన్సర్ నివారణలో


రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కేన్సర్ కారకాల్ని నాశనం చేస్తాయి. మరోవైపు యాంటీ ఏజీయింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి కాబట్టి..క్రమం తప్పకుండా తీసుకుంటే నిత్యం యవ్వనంగా ఉంటారు. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండటంతో రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే ఎమైనో యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రాగుల్లో ఉండే కాల్షియంతో ఎముకలు పటిష్టంగా మారి..కీళ్ల నొప్పులు దూరమౌతాయి.


మరీ ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు రాగులు తీసుకోవడం చాలా మంచిది. రాగుల్లోని ఎమైనో యాసిడ్స్ బాడీని రిలాక్స్ చేస్తాయి. రాగులు ఓ సంపూర్ణమైన బలవర్ధకమైన ఆహారం. రాగుల్లో కాల్షియం అధికంగా ఉన్నందున..కిడ్నీ వ్యాధిగ్రస్థులు రాగులు తీసుకోకూడదు.


Also read: Constipation: మలబద్ధకం సమస్య వేధిస్తోందా..కేవలం 2 వారాల్లోనే పరిష్కారం ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook