Dengue Symptoms: వేసవి తప్ప మిగిలిన రెండు సీజన్లలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఇమ్యూనిటీ తగ్గడం ఒకటైతే రెండవది అపరిశుభ్రత, కాలుష్యం. వర్షాకాలంలో జలుబు, జ్వరం, దగ్గుతో పాటు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు కూడా చుట్టుముడుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఈ క్రమంలో దోమ బెడద పెరగడం వల్ల డెంగ్యూ, మలేరియా జ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా డెంగ్య్యూ కేసులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రులకు వచ్చే కేసుల్లో డెంగ్యూ పాజిటివ్ ఎక్కువగా ఉంటోందని సమాచారం. పిల్లలు, పెద్దలు అందర్నీ ప్రభావితం చేస్తోంది. డెంగ్యూ అనేది దోమకాటుతో వచ్చే వ్యాధి. ఇది ఏడిస్ ఏజిప్టి అనే దోమ కారణంగా వ్యాపిస్తుంది. 


డెంగ్యూ వ్యాధికి కారణమయ్యే దోమ పగటి దోమ మాత్రమే. అంటే పగలు కుట్టే దోమలతోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. డెంగ్యూ సకాలంలో చికిత్సకు నోచుకోకపోతే ప్రాణాంతకమౌతుంది. అందుకే డెంగ్యూని గుర్తించేందుకు లక్షణాల గురించి తెలుసుకుందాం..


డెంగ్యూ జ్వరం ఉన్నప్పుడు చర్మంపై దద్దుర్లు, మూత్రంలో రక్తం, మలం వంటి లక్షణాలు ఉండవచ్చు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు ప్రధానమైన లక్షణాలు. మీజిల్స్ వచ్చినప్పుడు కన్పించే దద్దుర్లు ఉంటాయి. వికారం, వాంతులు మరో ప్రధాన లక్షణం. కళ్ల వెనుక నొప్పి, వికారం, వాంతులు, చిగుళ్ల నుంచి ముక్కు నుంచి రక్తం కారడం డెంగ్యూ జ్వరం లక్షణాలు. 


డెంగ్యూ జ్వరం ఉంటే శరీరంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.  డెంగ్యూ ఉన్నప్పుుడు పేగు గోడల్లో రక్తస్రావం ఉంటుంది. డెంగ్యూ జ్వరానికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేదు. అందుకే ఈ లక్షణాలను బట్టి ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోవాలి. ప్లేట్‌లెట్స్ సంఖ్య 20 వేల కంటే పడిపోతే ప్రమాదకర స్థాయిలో ఉందని అర్ధం. ఈ పరిస్థితుల్లో తక్షణం ప్లేట్‌లెట్స్ ఎక్కించుకోవల్సి వస్తుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య ఆరోగ్యవంతుడైన శరీరంలో 1,50 వేల నుంచి 4 లక్షల వరకూ ఉంటుంది.


Also read: Weight loss Drink: కొబ్బరి నీళ్లలో ఈ గింజలు కలిపి చూడండి, అద్బుతమే ఇక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook