Heart Attack Signs: గుండెపోటు వచ్చేముందు శరీరం పంపించే ఈ సంకేతాలతో జాగ్రత్త
Heart Attack Signs: మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అంగం గుండె. ఇది కొట్టుకున్నంతవరకే ప్రాణం ఉంటుంది. ఒకసారి ఆ చప్పుడు ఆగిందంటే ప్రాణం లేనట్టే ఇక. గుండె చప్పుడు ఆగకుండా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవాలి.
Heart Attack Signs: శరీరంలో అత్యంత ముఖ్యమైన అంగం గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం చాలా అవసరం. ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగానే గుండెకు నష్టం వాటిల్లుతుంటుంది.
గుండె పోటు అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువైపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సులవారికి టార్గెట్ చేస్తోంది. గుండెపోటు అంత హఠాత్తుగా రాదని..వచ్చేముందు శరీరం కొన్ని సంకేతాలిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. సకాలంలో ఆ సంకేతాల్ని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు నష్టం నుంచి నివారించవచ్చు. ఎందుకంటే ఇది అత్యంత ప్రాణాంతక పరిస్థితి. సరైన సమయంలో చికిత్స లేకుంటే ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి. ముఖ్యంగా 5 ప్రధాన సంకేతాలుంటాయిట.
గుండె రక్తాన్ని సరిగ్గా సరఫరా కాకపోవడం వల్ల గుండెతో పాటు చుట్టుపక్కలుండే భాగాలు కూడా ప్రభావితమౌతాయి. ఫలితంగా శరీరంలోని కొన్ని భాగాలు తిమ్మిరిగా అన్పిస్తాయి. గుండెపోటు వచ్చేముందు ఎడమవైపు దవడ మొద్దుబారడం లేదా నొప్పి ఉంటుంది. లేదా తిమ్మిరి కూడా ఉండవచ్చు. ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
గుండెపోటు వచ్చే ముందు ఎడమ భుజం తిమ్మిరిగా , తీవ్రమైన నొప్పిగా ఉంటుంది. గుండె ఎడమవైపు ఉన్నందున గుండెలో ఏదైనా సమస్య వస్తే శరీరంలోని ఎడమ భాగంలో రక్త ప్రసరణ నిలిచిపోవడం వల్ల సమస్య ఉత్పన్నమౌతుంది. అందుకే శరీరంలో ఎడమ భాగంలో నొప్పి లేదా తిమ్మిరి ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.
గుండె పనితీరులో సమస్య ఉంటే మెడ ఎడమవైపు ప్రభావితమై నొప్పి ఉంటుంది. సకాలంలో చికిత్స అందించకపోతే పరిస్థితి తీవ్రం కావచ్చు. గుండెపోటు వచ్చే ముందు శరీరంలోని వివిధ భాగాలకు రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల ఆయా భాగాల్లో తిమ్మిరి ఉంటుంది. ఎడమ చేయి నొప్పిగా ఉన్నా లేదా జలదరింపుగా ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
Also read: Garlic Tea: వెల్లుల్లి టీ లాభాలు వింటే ఇంకెప్పుడూ వదిలిపెట్టరు, అన్ని వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook