Angina Pain: ఛాతీలో నొప్పి అనేది సర్వ సాధారణం. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమై ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే ఛాతీలో నొప్పికి గుండె నొప్పికి దగ్గరి సంబంధముంది. గుండె నొప్పే ఛాతీలో నొప్పిగా ప్రారంభం కావచ్చు. అందుకే ఛాతీ నొప్పి, గుండె నొప్పికి మధ్య అంతరం తెలుసుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛాతీ నొప్పి తరచూ వస్తుండటం మంచి విషయం కానే కాదు. ఇది ప్రాణాంతక పరిస్థితులకు దారి తీయవచ్చు. యాంజైనా లేదా గుండె నొప్పికి సంకేతం కావచ్చు. ఎందుకంటే గుండె నొప్పి చూడ్డానికి ఛాతీ నొప్పిలానే కన్పిస్తుంది. గుండె నొప్పి లేదా యాంజైనా పరిస్థితిలో రక్తం, ఆక్సిజన్ తగినంతగా గుండెకు సరఫరా కాదు. గుండె నొప్పిలో ఇది ప్రధానమైన లక్షణం. సకాలంలో ఈ సమస్యకు చికిత్స చేయించకపోతే ప్రాణాంతకం కావచ్చు. 


యాంజైనా లేదా గుండె నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయి


ఛాతీలో ఒత్తిడి, పట్టేసినట్టు నొప్పి ఉంటుంది. నొప్పి అనేది చేతులు, భుజాలు, మెడ, జబ్బలు, వీపు అంతా వ్యాపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తవచ్చు. తరచూ వికారం లేదా వాంతులు వచ్చినట్టుంటుంది. తల తిరిగినట్టుంటుంది. అకారణంగా చెమట్లు పడతాయి. తీవ్రమైన అలసట కూడా ఉంటుంది. 


యాంజైనా అనేది సాధారణంగా శారీరక శ్రమ లేదా ఒత్తిడి ఎదురైనప్పుడు తలెత్తుతుంది. కాస్సేపు విశ్రాంతి తీసుకుంటే తొలగిపోతుంది. కొరోనరీ ధమనుల్ని ఇది క్రమక్రమంగా సంకోచించేలా చేస్తుంది. ఈ పరిస్థితిని స్టేబుల్ యాంజైనా అంటారు. ఇక మరో రకం కాస్త ప్రమాదకరమైంది. అస్థిరంగా ఉంటుంది. ఏ విధమైన హెచ్చరిక లేకుండానే రావచ్చు. విశ్రాంతి తీసుకున్నా దూరం కాదు. కొరోనరీ ధమనుల్లో అంతరాయం ఏర్పడుతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు.


ఇక వేరియంట్ యాంజైనా అనేది అరుదైనదని చెప్పవచ్చు. విశ్రాంతిగా ఉన్నప్పుడు, చలికాలంలో, ఒత్తిడిలో ఉన్నప్పుడు ఎదురౌతుంది. ఈ పరిస్థితుల్లో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా కాదు. 


యాంజైనా నుంచి రక్షించుకునే చిట్కాలు


రోజూ తగినంత వ్యాయామం చేయడం ద్వారా ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడమే కాకుండా ఇతర వ్యాధుల్నించి దూరంగా ఉండవచ్చు. డైట్‌లో ఎప్పుడూ ఆరోగ్యకరమైన పదార్ధాలే ఉండాలి. యోగా, ధ్యానంతో ఏకాగ్రత పెంచుకోవాలి. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. దూమపానం, మద్యపానంకు దూరంగా ఉండాలి. 


Also read: Fennel Water: వేసవిలో రోజూ ఈ నీళ్లు తాగితే డీ హైడ్రేషన్ సమస్యే ఉండదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook