సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటంలో ఆహారపు అలవాట్లే కీలకపాత్ర పోషిస్తాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోతే అది కాస్తా జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్యకు దారితీస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహారపు అలవాట్లు, జీవనశైలి సదా బాగుండేట్టు చూసుకోవాలి. ఈ రెండింట్లో ఏది గాడి తప్పినా అనారోగ్యకరమైన సమస్యలు ఏర్పడతాయి. ఇందులో కడుపుకు సంబంధించిన సమస్యలు సర్వ సాధారణం. ఆయిలీ, ఫ్రైడ్ పదార్ధాలు, జంక్ ఫుడ్, ప్రోసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. ఫలితంగా కడుపులో గ్యాస్, ప్రేవుల్లో వాపు వంటి సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకం మరో ప్రధాన సమస్య. కానీ కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువ సేపుంటే..సీరియస్ కావచ్చు. 


మలబద్ధకం నుంచి ఉపశమనం పొందాలంటే చాలా మార్గాల్ని పాటిస్తుంటారు. కానీ వీటిలో చాలావరకు సరైన ఫలితాలు సాధించవు. ఈ పరిస్థితుల్లో మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందేందుకు డైట్‌లో కొన్ని కీలకమైన మార్పులు చేయాలి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం..


మలబద్ధకం నుంచి విముక్తి ఎలా


మలబద్దకం సమస్య ఉన్నప్పుడు నిర్లక్ష్యం పనికి రాదు ఈ సమస్య ఉన్నప్పుడు రాత్రంతా ఓ అరలీటరు నీళ్లను రాగి చెంబులో ఉంచి ఉదయం తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదే సమయంలో మలబద్ధకం సమస్య కూడా పోతుంది. 


ఇక మరో చిట్కా..గోంద్ కతీరా వాడటం. ట్రాగాకాంత్ గమ్‌ను  రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీళ్లను తాగాలి. ఇందులో ఉండే పోషక గుణాలు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. రోజూ తీసుకోవచ్చు. మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందేందుకు మద్యాహ్నం భోజనానికి అరగంట ముందు మజ్జిగతో పాటు రాత్రంతా నానబెట్టిన చియా సీడ్స్ తీసుకోవాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 


Also read; Diabetes Care: మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలంటే..రోజూ ఈ 5 పనులు చేయాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook