Summer Health Tips: వేసవి తాపం ఎక్కువైనా కొద్ది ఆరోగ్య సమస్యలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఎండవేడితో వచ్చే వడదెబ్బ, కండరాల నొప్పి, అలసట వంటి ఆరోగ్య సమస్యలు అధికం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వడదెబ్బ విషయంలో వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోకపోతే.. ఒక్కోసారి వడదెబ్బ కూడా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. ఇంకొన్నిసార్లు అది ప్రాణాంతకం కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇటీవల కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఎండవేడి నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు.. ఇంకా వాటి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా డయేరియా, టైఫాయిడ్, వడ దెబ్బ, వైరల్ ఫీవర్ వంటి కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఎండలో ఎంత ఎక్కువసేపు యాక్టివ్ గా ఉంటే.. అంత ఎక్కువ జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, లేదా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఎండలోకి వెళ్లినప్పుడు... వారిపై ఎండ వేడి ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎండాకాలంలో ఎండ వేడి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. లేదంటే ఏదో ఒక అనారోగ్య సమస్య బారిన పడే అవాకాశాలే ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. 


ఢిల్లీలోని బీఎల్‌కే - మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కమ్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం హెచ్ఓడి అయిన డాక్టర్ రాజిందర్ కుమార్ సింగల్ ఇదే అంశంపై జీ మీడియాతో మాట్లాడుతూ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడే సాధారణ ఆరోగ్య సమస్యల గురించి, వాటి నుంచి సురక్షితంగా ఉండటానికి తీసుకోవాల్సిన చిట్కాలు, జాగ్రత్తల గురించి వివరించారు.


వేడిమితో వచ్చ అలసట
ఎండవేడిలో ఉంటూ తగిన మోతాదులో నీరు తాగకపోయినట్టయితే ఒంట్లో వేడిమి చేస్తుంది. ఎక్కువగా వృద్ధులు.. అది కూడా హై బీపీ ఉన్నవారు, ఎండలో పనిచేసే వారు లేదా వ్యాయామం చేసే వారు ఇలాంటి సమస్యల బారిన పడుతుంటారు.


వడ దెబ్బ
ఎండలో వెళ్లి అలసట బారిన పడటం వల్ల హీట్ స్ట్రోక్ లేదా తీవ్రమైన వేడి సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. హీట్ స్ట్రోక్ కూడా మెడికల్ ఎమర్జెన్సీ లాంటిదే. వీలైనంత త్వరగా వైద్య సహాయం తీసుకోకపోతే... ఒక్కోసారి అది ప్రాణాంతం కావొచ్చు లేదా శాశ్వత వైకల్యం బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదు.


ఎండా కాలం ఎండ వేడి నుండి సురక్షితంగా ఉండటానికి చిట్కాలు
డీ హైడ్రేట్ అవకుండా చూసుకోవాలి
మండు వేసవిలో చెమట రూపంలో శరీరంలోని ద్రవాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్లిపోతుంటాయి. అలా కోల్పోయిన ద్రవాలను తిరిగి తాగు నీరు రూపంలో తీసుకోకపోతే మీ శరీరం డీహైడ్రేషన్ బారినపడుతుంది. అందుకే ఎండా కాలంలో వీలైనంత వరకు ఎండను అవాయిడ్ చేస్తూనే తగిన మోతాదులో తాగు నీరు తీసుకోవాలి.


తాజా ఆహారమే తినాలి
తాజా పండ్లు, కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కనుక మీ ఆహార పదార్థాల్లో తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయల్లో శరీరానికి అవసరమైన పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి అనే విషయం మర్చిపోవద్దు.


తేలికపాటి, గాలి తగివే దుస్తులనే ధరించండి
వేసవికి తగినట్టుగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ముఖ్యంగా ధరించే దుస్తుల విషయంలో లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. శరీరానికి బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా వదులుగా ఉండే లైట్ కలర్ దుస్తులను ధరిస్తే బెటర్.


వేడి వేడి పానీయాలు తాగడం తగ్గించండి
టీ, కాఫీ లాంటి వేడి వేడి పానియాలతో పాటు ఒంటికి వేడిమి చేసే ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి. భోజనం విషయంలోనూ వేపుళ్లు, మసాలాలు ఉండే జంక్ ఫుడ్ కాకుండా లైట్ మీల్స్‌కే ప్రాధాన్యత ఇవ్వాలి. 


ఇది కూడా చదవండి : Weight Loss Drink: కొత్తిమీర గింజలతో చేసిన డికాషన్‌తో కేవలం 25 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..మీరు కూడా ఇలా ట్రై చేశారా?


వేసవిలో తీసుకోవాల్సిన ఆహారం
పుచ్చకాయలు, ఆకు కూరలు, మజ్జిగ, నిమ్మకాయ రసం, పెరుగు, కొబ్బరి, పుదీనా,  మామిడి పండ్లు వంటి పదార్థాలను తీసుకుంటే వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. కాఫీలు, నిల్వ పచ్చళ్లు, సోడా, ఆల్కహాల్, ఎక్కువ మోతాదులో ఉప్పుతో చేసిన ఫుడ్స్, మిల్క్‌షేక్స్, వేపుడు వంటి జంక్ ఫుడ్స్ పూర్తిగా పక్కకు పెట్టడమే మీ ఆరోగ్యానికి మంచిది అంటున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.


ఇది కూడా చదవండి : Cholesterol tips: ఈ 4 డ్రింక్స్ తాగితే చాలు కొలెస్ట్రాల్ సమూలంగా నిర్మూలించవచ్చు


ఇది కూడా చదవండి : Health Tips: రోజూ ఇవి నానబెట్టి తింటే..మధుమేహమైనా, కొలెస్ట్రాల్ అయినా దూరం కావల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK