Health Problems of Vitamin C Deficiency: విటమిన్ సి తో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయనే సంగతి జగమెరిగిన సత్యం. ముఖ్యంగా ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొందాలి అంటే కచ్చితంగా విటమిన్ సి తీసుకోవాలి. లేదంటే వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్స్ సోకడం ఈజీ అవడంతో పాటు అలా సోకిన వైరస్‌లు అతి కొద్ది కాలంలోనే మెచ్యూర్ అయి విపరీతమైన అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఇంకెన్నో అనారోగ్య సమస్యలు పొంచి ఉన్నాయి. విటమిన్ సి లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీజనల్ ఇన్‌ఫెక్షన్స్, సాధారణ జలుబు ..
విటమిన్ సి లోపం ఉన్న వారికి సీజనల్ ఇన్ ఫెక్షన్స్, జలుబు, జ్వరం లాంటి ఇతరత్రా జబ్బులు సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో పాటు దీర్ఘకాలం పాటు వాటితో బాధపడే అవకాశం కూడా ఉంది. విటమిన్ సి ఉన్న వారికి అంత ఈజీగా ఇన్ ఫెక్షన్స్ సోకకపోగా... ఒకవేళ ఏదైనా జబ్బు సోకినా.. అది ఎక్కువ కాలం వేధించకుండా త్వరగానే నయమైపోతుంది.


డయాబెటిస్ పేషెంట్స్ విషయంలో విటమిన్ సి పాత్ర ..
డయాబెటిస్‌తో బాధపడే వారికి మిగతా వారి కంటే కొంత విటమిన్ సి లోపం ఉంటుంది. కానీ వాస్తవానికి మధుమేహంతో బాధపడే వారికే విటమిన్ సి తో ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే మధుమేహంతో బాధపడే వారిలో రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగేందుకు విటమిన్ సి సహాయపడుతుంది. 


గుండె సంబంధిత జబ్బులు :
విటమిన్ సి ఉన్న వారిలో గుండె సంబంధిత జబ్బులు సోకే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది అని అనేక అధ్యయనాల్లో తేలింది. గడ్డ కట్టిన రక్తాన్ని రెగ్యులేట్ చేయడంలో విటమిన్ సి పాత్ర కీలకం.


ఎనీమియా :
మనం తీసుకునే ఆహారంలో ఉన్న ఐరన్ ని గ్రహించడంలో విటమిన్ సీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఐరన్ మాత్రలు ఉపయోగించాల్సి వస్తే.. అంతకంటే ముందుగా విటమిన్ సి ఉండే ఫుడ్ తీసుకుంటే.. ఆ ఐరన్ సప్లిమెంట్స్ ఒంటికి చెందుతాయని డాక్టర్లు చెబుతుంటారు. విటమిన్ సి లోపం ఉన్న వారికి ఐరన్ లోపం కూడా వచ్చే ప్రమాదం ఉంది. అదే కానీ జరిగితే మళ్లీ అది ఎనీమియాగా మారే ప్రమాదం ఉంది. 


ఇది కూడా చదవండి : Kidney Disease Patients: కిడ్నీ పేషెంట్స్‌ ఎలాంటి ఆహారం తినాలంటే..


దీర్ఘకాలం వేధించే గాయాలు : 
విటమిన్ సీ లేనివారికి ఏదైనా గాయమైతే.. అది వెంటనే తగ్గే అవకాశాలు చాలా తక్కువ. అంతేకాకుండా వారిలో దంతాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా అంతే ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. 


న్యూమోనియా :
న్యూమోనియాతో బాధపడే వారిలో విటమిన్ సి లోపం ఉన్నట్టయితే.. వారు న్యూమోనియో సమస్యతో ఎక్కువ కాలం ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అని హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 


ఇది కూడా చదవండి : Summer Health Problems: ఎండాకాలంలో ఎండవేడితో వచ్చే జబ్బులు


ఇది కూడా చదవండి : Tips For Bright Teeth: మెరిసే, శుభ్రమైన దంతాల కోసం ఇలా చేయండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK