Health Remedies: ఆధునిక జీవన విధానం, వివిద రకాల చెడు ఆహారపు అలవాట్లు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. పోషకాల లోపం ఏర్పడి అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటుంది. అల్సర్లు, మలబద్దకం, స్థూలకాయం వంటివి ఇందులో ప్రధానమైనవి. అయితే ప్రకృతిలో విరివిగా లభించే ఓ రకం ఆకులతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతి మనకు తెలియకుండా చాలా అద్భుతమైన ప్రయోజనాలను తనలో నింపుకుని ఉంటుంది. ప్రకృతిలో లభించే ఆకులు,అలముల్లో ఊహించని ఔషధ గుణాలు దాగున్నాయి. అల్సర్ నివారణ, గ్లూకోజ్ లెవెల్స్ నియంత్రణకు సైతం ఈ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే అనారోగ్యం వెంటాడిన ప్రతిసారీ వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రకృతిలో లభించే వివిధ రకాల వస్తువులు, మొక్కలు, ఆకులు, మూలికలతో చాలా రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. 


తమలపాకుల గురించి భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది పాన్ తినకుండా ఉండలేరు కూడా. అదే సమయంలో హిందూమత విశ్వాసాల ప్రకారం కూడా తమలపాకులకు విశేష మహత్యముంది. పూజల్లో ఉపయోగిస్తుంటారు. ఆయుర్వేదంలో కూడా తమలపాకులకు ప్రాధాన్యత ఉంది. ఈ ఆకుల్లో అద్భుతమైన ఆయుర్వేద ఔషధ గుణాలున్నాయి.తమలపాకులతో అల్సర్, డయాబెటిస్ సహా చాలా వ్యాధుల్నించి ఉపశమనం లభిస్తుంది. వీటిలో అయోడిన్, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, నికోటినిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.


ఈ ఆకులు మధుమేహం వ్యాదిగ్రస్థులకు చాలా లాభం చేకూరుస్తాయి. వీటితో శరీరంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రించవచ్చు. గాయాల నివారణకు సైతం పాన్ ఆకులు ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు గాయాన్ని త్వరగా తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో పాన్ ఆకుల పాత్ర కీలకం.


ఆధునిక జీవనశైలిలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారుతోంది. తమలపాకుల సహాయంతో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నారు. ఇక కడుపుకు సంబంధించిన సమస్యలకు కూడా తమలపాకులు అద్బుతంగా దోహదపడతాయి. పాన్ ఆకులు తీసుకుంటే..శరీరంలోని జీవక్రియ మెరుగుపడుతుంది. దాంతోపాటు జీర్ణక్రియ, అల్సర్, మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి.


Also read; Health Tips and Remedies: రోజూ పరగడుపున ఆ ఒక్కటి తింటే చాలు...అన్ని సమస్యలకు చెక్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook