Garlic Benefits: ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే వెల్లుల్లి, తేనెతో ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఎలా వాడాలి, ఎప్పుడు తీసుకోవాలనేది తెలుసుకుందే చాలు. ఈ రెండింటి కాంబినేషన్‌తో కలిగే ప్రయోజనాలు వింటే నోరెళ్లబెట్టడం ఖాయం. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెల్లులి, తేనె ప్రతి ఇంట్లో తప్పకుండా ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి ఉదయం వేళ పరగడుపున తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వెల్లుల్లి-తేనె కాంబినేషన్ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు దోహదపడుతుంది. చాలా సమస్యలు దూరమౌతాయి. ఇందులో యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల చాలా సమస్యలు తొలగిపోతాయి. ఈ రెండింటి కాంబినేషన్‌తో ఇమ్యూనిటీ పెంచవచ్చు. గుండె సంబంధిత సీరియస్ వ్యాధులు దూరమౌతాయి. అయితే రోజూ పరగడుపున తీసుకోవల్సి వస్తుంది.


ఇమ్యూనిటీ బలోపేతం


వెల్లుల్లి-తేనె రెండింటినీ కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ బాగా పటిష్టమౌతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు ఉపయోగపడతాయి. అందుకే ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయి. చాలావరకు వ్యాధులు దూరమౌతాయి.


గుండె ఆరోగ్యం


వెల్లుల్లి-తేనె కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా లాభదాయకం. ఈ రెండింటిలో ఉండే పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె వ్యాధిగ్రస్థులకు ఈ మిశ్రమం చాలా మంచిది.


అధిక బరువుకు చెక్


తేనె-వెల్లుల్లి మిశ్రమం రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. రోజూ తీసుకోవడం వల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది. రోజూ పరగడుపున సేవిస్తే స్థూలకాయానికి కొద్దిరోజుల్లోనే చెక్ పెట్టవచ్చు.


జలుబు-జ్వరం నుంచి ఉపశమనం


వెల్లుల్లి-తేనెలోని పోషక గుణాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత పెంచడం వల్ల జలుబు, జ్వరం వంటి సమస్యలు దూరమౌతాయి. గొంతులో గరగర లేదా సైనస్ సమస్య కూడా దూరమౌతుంది.


Also read: Diabetes Ayurvedic Tips: ఈ ఐదు పదార్ధాలు రోజూ తీసుకుంటే మధుమేహానికి నెలలోనే చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook