Health Tips | రోజువారీ ఆహారంలో మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైనది అల్పాహారం (Breakfast). ఏ పూట తిన్నా, తినకున్నా ప్రతిరోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా తినాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సన్నగా అవ్వాలనో, లేక బరువు పెరుగుతున్నారనే భయంతోనో, మరేదైనా కారణాలతో బ్రేక్‌ఫాస్ట్ చేయడం మానేస్తే ఆరోగ్యం విషయంలో అనర్థాలు తప్పవని (Skipping Breakfast Causes Health Issues) హెచ్చరిస్తున్నారు.   Weight Loss Tips: బొజ్జ రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి 


బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఇవే... (Effects Of Skipping Breakfast) 


  • Heart Issues | ఉదయం అల్పాహారం తినే వారితో పోల్చితే మానేసే వారిలో (Skipping Breakfast) గుండె సంబంధిత జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశాలు 27 శాతం ఎక్కువగా ఉంటాయని తేలింది.

  • బ్రేక్‌ఫాస్ట్ మానేసే మహిళలలో టైప్2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్యయనంలో తేలింది. దాదాపు 47 వేల మంది మహిళలపై ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి ఈ విషయాన్ని గుర్తించారు.

  • బ్రేక్‌ఫాస్ట్ మానేయడమే కాదు, చాలా ఆలస్యంగా ఉదయం వేళ అల్పాహారం తీసుకున్నా చేటు చేస్తుంది. దీనివల్ల మేగ్రేన్ (Migraine) తలనొప్పి సమస్య బారిన పడే ప్రమాదముంది. దీర్ఘకాలం దీని ప్రభావం ఉంటుంది. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా! 
     Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి

  •  పగటి వేళ ఆహారం మానేస్తే అనర్థాలు తప్పవని యూకే క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే కొన్ని రకాల క్యాన్సర్ (Risk Of Cancer) బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

  • టీనేజీ పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ తినకపోతే వారి ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది. అల్పాహారం తినే పిల్లలతో పోల్చితే తినని టీనేజర్స్ ఏ విషయంపైనా ఏకాగ్రత చూపలేరు. మంచి ఫలితాలు సాధించలేరట.

  • బ్రేక్‌ఫాస్ట్ రెగ్యూలర్‌గా మానేస్తుంటే కొన్ని రోజుల తర్వాత రక్తహీనత సమస్య బారిన పడతాం. ఒకవేళ ఆల్కాహాల్ సేవించిన వారు ఉదయం అల్పాహారం తినకపోతే హ్యాంగోవర్ సమస్య అధికం అవుతుంది. అల్పాహారం మానేస్తే వీరిలో షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోతాయి. మందుబాబులు మీ ఆరోగ్యం కోసం ఇకనైనా ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా చేయక తప్పదు.

  • సన్నగా అవ్వాలని బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారు కానీ దానివల్ల బరువు పెరిగే అవకాశం (Skipping Breakfast Might Cause Weight Gain) ఉందని ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకుని బరువు పెరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. తల్లి పాలతో కరోనా సోకుతుందా? ఏ జాగ్రత్తలు పాటించాలి

  • అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి (Hair Loss) బట్టతల వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ వల్లే జట్టుకు కావలసిన అత్యధిక పోషకాలు అందడమే అందుకు ప్రధాన కారణం.

  • తరచుగా బ్రేక్‌ఫాస్ట్ మానేసే వారిలో జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు 10, 12 గంటల తర్వాత శరీరానికి ఇచ్చే ఆహారం అందకపోతే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఉదయం తినకుండా నేరుగా మధ్యాహ్నం తింటే వేగంగా జీర్ణమవుతుంది.

  • బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయడం వల్ల శరీరంలో శక్తి లేక తరచుగా అలసటకు గురవుతాం. అది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా? 
    Carrot Benefits: క్యారెట్ తింటే ఈ 10 ప్రయోజనాలు తెలుసా!