Amla Health Benefits: ప్రస్తుతం చలికాలం నడుస్తోంది. శీతాకాలంలో ప్రధానంగా లభించే ఫ్రూట్స్‌లో ఉసిరికాయ అతి ముఖ్యమైంది. ఎందుకంటే శీతాకాలంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఉసిరికాయల్ని ఏ రూపంలో తీసుకోవాలి, ఏయే ప్రయోజనాలు కలుగుతాయనే వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీజన్ మారుతోంది. శీతాకాలం ప్రవేశించడంతో క్రమంగా చలిగాలులు పెరుగుతున్నాయి. చలికాలంలో ఎదురయ్యే జలుబు, దగ్గు, జ్వరం సమస్యలు వేధిస్తున్నాయి. ఆస్తమా రోగులకైతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణంగా చలికాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి సహజంగా తగ్గుతుంది. ఫలితంగా సీజనల్ వ్యాధులు త్వరగా ఎటాక్ అవుతాయి. అయితే శీతాకాలంలో విరివిగా లభించే ఉసిరకాయతో చలికాయం సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. ఉసిరికాయల్ని వివిధ రూపాల్లో మీ డైట్‌లో చేర్చవచ్చు.


ఉసిరి నిజంగానే ఓ అద్భుతమైన ఔషధం. ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ శరవేగంగా పెరుగుతుంది. దాంతో పాటు చర్మం, కేశాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తెల్ల వెంట్రుకల సమస్య ఉంటే రోజూ ఉసిరి తీనడం ద్వారా కేశాలు, చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి.


ఉసిరికాయల్లో పుష్కలంగా ఉండే సాల్యుబుల్ ఫైబర్ కారణంగా సఱీరంలో చక్కెర సంగ్రహణ కాకుండా ఉంటుంది. ఫలితంగా మీ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ అద్భుతంగా తగ్గుతుంది. అందుకే డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఉసిరి మంచి ఔషధంలా పనిచేస్తుంది. 


ఉసిరికాయలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలున్నవాళ్లు రోజూ క్రమం తప్పకుండా ఉసిరికాయల్ని తీసుకోవాలి.


ఉసిరికాయల్ని డైట్‌లో చేర్చేందుకు తేనెలో కలిపి సేవించవచ్చు. దీనివల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఎప్పుడైతే పెరిగిందో అన్ని సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.


Also read: Heart Attack Signs: ఈ 5 సంకేతాలు కన్పిస్తే గుండె అనారోగ్యంగా ఉన్నట్టే, నిర్లక్ష్యం వద్దిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook