Cholesterol Remedies: ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే..కొలెస్ట్రాల్ ఎంత ఉన్నా ఇట్టే మాయం
Cholesterol Remedies: ఆధునిక జీవన విధానంలో కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం అత్యంత ప్రమాదకరం. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే ఈ ప్రమాదకర వ్యాధులకు కారణం. అందుకే వీటి నియంత్రణ కూడా పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cholesterol Remedies: మనిషి శరీరంలో తలెత్తే చాలా రకాల వ్యాధులకు మూల కారణం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే చాలా రకాల సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్, రక్తపోటు అనేవి కొలెస్ట్రాల్ తగ్గితే నియంత్రణలో వచ్చే సమస్యలే. అలాగని నిర్లక్ష్యం చేస్తే కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరం కానుంది. అయితే ఈ 5 చిట్కాలు పాటిస్తే కొలెస్ట్రాల్ ఎంత ఉన్నా నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందంటే గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ ముప్పు పెరుగుతున్నట్టే అర్ధం చేసుకోవాలి. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ స్థాయి అమాంతం పెరిగిపోతుంటుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది. బ్లడ్ కాట్స్ ఏర్పడే అవకాశముంటుంది. దాంతో అటు రక్తపోటు కూడా పెరిగి గుండెపై ఒత్తిడి అధికమౌతుంది. ఇది గుండెపోటుకు , కార్డియాక్ అరెస్టుకు దారి తీయవచ్చు. ఆయుర్వేద శాస్త్రంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతమైన ఔషదాల గురించి ప్రస్తావన ఉంది. ముఖ్యంగా ఐదు రకాల చిట్కాలు పాటిస్తే కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉన్నా నియంత్రించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆయుర్వేదంలో అర్జున బెరడు ఉపయోగం శతాబ్దాలుగా ఉన్నదే. హైపర్ టెన్షన్, హార్ట్ ఫెయిల్యూర్, యాంజినల్ పెయిన్, గుండె పోటు వంటి సమస్యలకు అర్జున బెరడు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ బెరడులో ఉండే ట్రైటర్పనాయిడ్స్, బీటా సిటోస్టెరాల్స్, ఫ్లేవనాయిడ్స్ , గ్లైకోసైడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి. ఇక రెండవది ఉసిరి. విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఇమ్యూనిటీని పటిష్టం చేస్తుంది. ఉసిరిలో ఉండే హైడ్రోక్సీప్రొఫెల్ మీథైల్ సెల్యులోజ్ అనేది కొలెస్ట్రాల్‌ను తగ్గించే అద్భుతమైన కారకం. నెలరోజులు ఉసిరికాయను క్రమం తప్పకుండా వినియోగిస్తే సీరమ్ కొలెస్ట్రాల్ అద్భుతంగా తగ్గుతుంది.
ఇక ఆయుర్వేదంలో ఉన్న మరో అద్భుతమైన ఔషధం అశ్వగంధ. ఇది ఔషధ మొక్క. రక్తంలో కొలెస్ట్రాల్‌తో పాటు షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. అశ్వగంధను రాత్రిపూట తీసుకుంటే మంచిది. సుఖమైన నిద్ర కూడా పడుతుంది. అంటే అశ్వగంధను రోజూ క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు బ్లడు షుగర్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత మరి దేనికీ లేదనే చెప్పాలి. అదే సమయంలో తులసి మొక్కతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. 40 ఏళ్లు పైబడినవారు క్రమం తప్పకుండా తులసి నీళ్లు తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గుతుందంటారు. 2-3 వారాల్లోనే ఫలితాలు చూడవచ్చు.
ఇక ఆయుర్వేదం ప్రకారం మరో అద్భుతమైన మూలిక పసుపు. ఇది అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇందులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధంతో గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. మరీ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ అత్యంత వేగంగా తగ్గుతుంది.
Also read: Mushroom Benefits: మష్రూమ్స్ తినడం వల్ల శరీర బరువుతో పాటు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గించుకోవచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook