Cholesterol Tips: మజ్జిగ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు, మలబద్ధకం సమస్య రాకుండా చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది రోజుకొక గ్లాసైనా మజ్జిగ తాగుతుంటారు. ఇంట్లో స్వయంగా తయారు చేసుకుని మజ్జిగ తాగినంత లాభం మరెందులోనూ ఉండదు. మజ్జిగతో కలిగే ప్రయోజనాలేంటి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో కొలెస్ట్రాల్ అనేది ఏ మాత్రం మంచిది కాదు. కొలెస్ట్రాల్ పెరిగేకొద్దీ రక్తపోటు, డయాబెటిస్, స్థూలకాయం, హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజెస్ ముప్పు పెరుగుతుంటుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే రోజూ క్రమం తప్పకుండా మజ్జిగ తాగాల్సి ఉంటుంది. మీరు తాగే మజ్జిగలో కొద్దిగా మెంతి గింజలు, ఫ్లక్స్ సీడ్స్, జీలకర్ర కలిపి తాగితే మరింత ప్రయోజనకరం. 


ముందుగా పెరుగు, నీళ్లు తగినంతగా తీసుకుని బాగా చిలకరించాలి. మరోవైపు కొద్దిగా మెంతులు, ఫ్లక్స్ సీడ్స్, జీలకర్ర కలిపి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మజ్జిగ ఓ గ్లాసులో తీసుకుని అందులో ఒక స్పూన్ ఫ్లక్స్ సీడ్స్, జీలకర్ర, మెంతుల పౌడర్ కలుపుకోవాలి. రోజూ మద్యాహ్నం భోజనం చేసిన తరువాత తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. శరీరంలో ఉండే హై కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. 


కొలెస్ట్రాల్ తగ్గించకపోతే ముందుగా రక్తపోటుపై ప్రభావం పడుతుంది. రక్తపోటు పెరగడం అంటే హార్ట్ స్ట్రోక్ ముప్పు పెరిగినట్టే. అదే సమయంలో కొలెస్ట్రాల్ అనేది స్థూలకాయానికి సూచన. స్థూలకాయం ఉందంటే మధుమేహం వ్యాధిని ఆహ్వానించినట్టే. అందుకే అన్నింటికీ మూలమైన కొలెస్ట్రాల్ ను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. రోజూ క్రమం తప్పకుండా మజ్జిగ తయారు చేసుకుని తాగడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. 


Also read: Anti Aging Foods: ఈ ఆహార పదార్ధాలు తీసుకుంటే చాలు, వృద్ధాప్యం ఎప్పటికీ చేరదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook