Weight loss Drink: కొబ్బరి నీళ్లలో ఈ గింజలు కలిపి చూడండి, అద్బుతమే ఇక
Weight loss Drink: ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం లేదా అధిక బరువు సమస్య చాలామందిని వెంటాడుతోంది. ఫలితంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ క్రమంలో అధిక బరువు నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం..
Weight loss Drink: ఇటీవలి కాలంలో అధిక బరువు పెను సమస్యగా మారిపోయింది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు. జీవన విధానం సరిగ్గా లేకపోవడం, నిద్రలేమి, బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా ఈ సమస్య తలెత్తుతోంది. అధిక బరువును వెంటనే నియంత్రింతచకపోతే సమస్యాత్మకం కావచ్చు.
స్థూలకాయం లేదా అధిక బరువు అనేది ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. గంటల తరబడి కూర్చుని ఉండే ఉద్యోగాల కారణంగా శారీరక శ్రమ లేకపోవడం కూడా బరువు పెరగడానికి ప్రధాన కారణం. బరువు నియంత్రించేందుకు హెల్తీ ఫుడ్, హెల్తీ లైఫ్‌స్టైల్ అనేది చాలా అవసరం. ప్రత్యేకించి మార్నింగ్ డ్రింక్ ఎంపిక బాగుండాలి. ఉదయం తీసుకునే డ్రింక్ హెల్తీ అయుంటే..బరువు కచ్చితంగా తగ్గుతుంది.
ఈ నేపధ్యంలో అధిక బరువు నియంత్రించేందుకు ఆయుర్వేద వైద్యులు, న్యూట్రిషనిస్టులు బెస్ట్ హెల్తీ డ్రింక్ సూచిస్తున్నారు. రోజూ ఉదయం కొబ్బరి నీళ్లు తాగితే అద్బుతమైన ప్రయోజనాలుంటాయంటున్నారు. ఇందులో సబ్జా గింజలు కలిపితే మెరుగైన ఫలితాలుంటాయి. ఓ గ్లాసు కొబ్బరి నీళ్లలో కేవలం 46 కేలరీలే కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇంకా ఎలక్ట్రోలైట్స్ విటమిన్ సి, పొటాషియం వంటి కీలకమైన పోషకాలు లభిస్తాయి. శరీరాన్ని హైడ్రైట్‌గా హెల్తీగా ఉంచుతాయి.
కొబ్బరి నీళ్లలో ల్యారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఓ రకమైన ఫ్యాటీ యాసిడ్. మెటబోలిజంను అద్భుతంగా వేగవంతం చేస్తుంది. మెటబోలిజం వేగవంతమైతే శరీరంలోని కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతుంది. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు ముప్పు కూడా తగ్గుతుంది.
కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి శరీరానికి నష్టం చేకూరుస్తాయి. వివిధ రకాల వ్యాధులకు కారణమౌతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. ఇమ్యూనిటీని అద్భుతంగా పెంచుతాయి.
కొబ్బరి నీళ్లు రోజూ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఫైబర్ అనేది జీర్ణక్రియను వేగవంతం చేయడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు.
Also read: Weight Loss Tips: ఇలా డ్రై ఫ్రూట్స్ తింటే 10 రోజుల్లో మీ శరీర బరువు త్తగ్గటం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook