Healthy Drink: అల్లం కాడా గురించి తెలుసా, రోజూ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనలివే
Healthy Drink: అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి ఇందులో. అల్లం కాడా తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లం ఆయుర్వేదపరంగా అద్భుతమైన ఔషధ గుణాల వేదిక. అల్లం అనేది రుచిని పెంచడమే కాకుండా..పోషక విలువల్ని పెంచడంలో దోహదపడుతుంది. అల్లం స్వభావరీత్యా వేడి కావడంతో చలికాలంలో వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకోవచ్చు.
అంతేకాకుండా ఆల్లంతో ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. దీనికోసం అల్లం కాడా చేసుకుని సేవించాల్సి ఉంటుంది. అల్లం కాడా తాగడం వల్ల శరీరపు ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా..అల్లం కాడా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతోపాటు మజిల్ పెయిన్ దూరం చేస్తుంది. మరి అల్లం కాడా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
అల్లం కాడా తయారీ విధానం
అల్లం కాడా తయారు చేసేందుకు ముందుగా ఓ గిన్నెలో 2 కప్పుల నీరు తీసుకుని స్టౌవ్‌పై ఉంచాలి. ఇందులో అల్లం, తులసి ఆకులు, 1 దాల్చిన చెక్క ముక్క, కొన్ని నల్ల మిరియాలు వేయాలి. ఆ తరువాత ఇందులో ఒక స్పూన్ తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 5-7 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత వడకాచి వేడివేడిగా తీసుకోవాలి. రుచి కోసం కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు.
అల్లం కాడాతో కలిగే ప్రయోజనాలు
అల్లంలో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కలిగే హానిని తొలగిస్తాయి. అందుకే అల్లం కాడా తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరమౌతాయి. దాంతోపాటు గొంతు గరగర కూడా తగ్గుతుంది.
జీర్ణక్రియ
అల్లం కాడా తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలైన మలబద్ధకం, అజీర్తి , కడుపు నొప్పి వంటి సమస్యలు దూరమౌతాయి. వాంతులు వచ్చేట్టున్నా అల్లం కాడాతో తగ్గిపోతుంది.
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుండటం వల్ల మజిల్స్ పెయిన్ దూరం చేసేందుకు అల్లం కాడా మంచి ప్రత్యామ్నాయం. వేడినీళ్లలో అల్లం మరిగించి తాగినా ఒంటి నొప్పులు, మజిల్ పెయిన్స్ తగ్గుతాయి. అల్లంలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాల వల్ల తలనొప్పి సమస్య తగ్గుతుంది. దీనికోసం అల్లం కాడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
Also read: Cholesterol Symptoms: మీ బాడీలో కొలెస్ట్రాల్ అధికమైతే కన్పించే లక్షణాలివే, వెంటనే జాగ్రత్త పడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook