Diabetes Prevention Tea: టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతుంటే..రోజూ ఆ టీ తాగితే నెలరోజుల్లో మధుమేహం మాయం
Diabetes Prevention Tips: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైంది. ఒకసారి వచ్చిందంటే ఇక జీవితాంతం వెంటాడుతుంది. చికిత్స లేదు..నియంత్రణ మాత్రమే సాధ్యం. అందుకే దీనిని లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఈ వ్యాధి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
Diabetes Prevention Tea: ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తుతున్న వ్యాధుల్లో ప్రధానమైంది మధుమేహం. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, జీవనశైలి డయాబెటిస్ వ్యాధికి ప్రధాన కారణం. ఈ వ్యాధికి చికిత్స లేకపోయినా నియంత్రించేందుకు సులభమైన చిట్కాలు చాలా అందుబాటులో ఉన్నాయి.
డయాబెటిస్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మధుమేహం కోరలు చాచుతోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, స్థూలకాయం వంటివి డయాబెటిస్‌కు కారణమౌతున్నాయి. డయాబెటిస్ అనేది రెండు రకాలు. టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్.
డయాబెటిస్ నిర్మూలనకు లేదా నియంత్రణకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి. అందులో కీలకమైంది గ్రీన్ టీ. గ్రీన్ టీతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ రోగులకు గ్రీన్ టీ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. గ్రీన్ టీతో ఇంకా ఇతర ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సన్నబడేందుకు గ్రీన్ టీ తాగుతుంటారు. గ్రీన్ టీ ఆరోగ్యపరంగా చాలా మంచిది. గ్రీన్ టీ రోజూ తాగితే..గుండె పదికాలాలు పదిలంగా ఉంటుంది.
గ్రీన్ టీతో కలిగే లాభాలు
శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి.
టైప్ 2 డయాబెటిస్‌కు ఓ వరం
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తే.. శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఎందుకంటే గ్రీన్ టీలో కొటేకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. కార్బొహైడ్రేట్లను త్వరగా జీర్ణం చేయకుండా..నియంత్రించడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బరువు ఎప్పుడైతే తగ్గుతుందో..ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. శరీరంలో ఉన్న ఇన్సులిన్ పూర్తిగా వినియోగమౌతుంది. ఫలితంగా రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు రోజూ 2-3 కప్పుల గ్రీన్ టీ తాగితే మంచిది.
మార్కెట్లో గ్రీన్ టీ వివిధ రకాల రుచుల్లో లభిస్తోంది. గ్రీన్ టీ లెమన్, గ్రీన్ టీ హనీ, గ్రీన్ టీ జింజర్, గ్రీన్ టీ తులసి ఇలా చాలా రకాలున్నాయి. మన అవసరానికి, రుచికి తగ్గట్టుగా ఎంచుకోవాలి. అయితే గ్రీన్ టీ ఎవరు పడితే వాళ్లు తాగకూడదు. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తాగాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ ఎసిడిటీ , కెఫీన్ అలర్జీ ఉన్నవారికి గ్రీన్ టీ అంత మంచిది కాదు. మితంగా తీసుకోవాలి.
Also Read: Aloevera tips: అల్లోవెరాను ఇలా సేవిస్తే..ఈ అనారోగ్య సమస్యలన్నీ మాయం
Also Read: Jio plans for ipl 2023: అన్‌లిమిటెడ్ డేటాతో ఐపీఎల్ చూసే అవకాశం, నెలకు 198 రూపాయలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook