Lemongrass Tea: లెమన్ గ్రాస్ టీ ప్రయోజనాలు తెలిస్తే ఎప్పుడూ వదిలిపెట్టరు, కేన్సర్ సైతం నియంత్రణలో
Lemongrass Tea: దేశంలో అత్యధిక ప్రజలు టీ తాగడాన్ని ఇష్టపడుతుంటారు. చాలామందికి టీ తాగనిదే రోజు గడవదు. కానీ టీ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కానే కాదు. టీ తాగే అలవాటుకు బదులు లెమన్ గ్రాస్ టీ తాగడం చాలా మంచిది.
Lemongrass Tea: టీ ఆరోగ్యానికి హాని చేకూరుస్తుంది. అందుకే ఆ స్థానంలో లెమన్ గ్రాస్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.లెమన్ గ్రాస్ అనేది ఓ ఆయుర్వేద మూలిక. సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ మూలికను చాలా రకాలుగా ఉపయోగిస్తారు. లెమన్ గ్రాస్ టీ అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే హెర్బల్ టీతో సమానం. రోజూ లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
లెమన్ గ్రాస్ టీ రోజుకు 1-2 సార్లు తాగితే కేశాలు,చర్మానికి చాలా మంచిది. చర్మానికి నిగారింపు వస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇందుకు ఉపయోగపడతాయి. ఏజీయింగ్ ప్రక్రియను మందగించేలా చేయడం వల్ల నిత్యం యౌవనంగా ఉంటారు.
ఇక కొన్ని అధ్యయనాల ప్రకారం లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల యాంటీ కేన్సర్ గుణాలు లభిస్తాయి. అంటే కేన్సర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. దీనికోసం రోజుకు 2 లేదా అంతకంటే ఎక్కువ లెమన్ గ్రాస్ టీ తాగాల్సి ఉంటుంది.
కొలెస్ట్రాల్ తగ్గించేందుకు లెమన్ గ్రాస్ టీ మంచి ప్రత్యామ్నాయం. చాలా అద్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల రక్త నాళికల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ కరుగుతుంది. దాంతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె వ్యాధుల ముప్పు కూడా తగ్గిపోతుంది. అన్నింటికీ మించి రోజూ క్రమం తప్పకుండా లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల బరువు నియంత్రణలో వచ్చేస్తుంది. ఎందుకంటే లెమన్ గ్రాస్ టీ తాగడం ద్వారా శరీరం మెటబోలిజం ప్రక్రియ వేగవంతమౌతుంది. దాంతో కడుపు, పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కరుగుతుంది. ఆకలిని సైతం తగ్గిస్తుంది. ఎక్కువ తినకుండా ఉండగలుగుతారు.
శరీరంలోని వివిధ అనారోగ్య సమస్యలకు మూలంగా ఉండే కడుపు సంబంధిత సమస్యలకు లెమన్ గ్రాస్ టీ మంచి పరిష్కారం. రోజూ క్రమం తప్పకుండా లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల అజీర్తి, మల బద్ధకం, గ్యాస్ , కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమౌతాయి.
Also read: Skin Care For Winter: చలి కాలంలో ఉన్ని దుస్తువు ధరిస్తున్నారా? ఇక అంతే సంగతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook