Muskmelon Milkshake: వేసవిలో దాహం తీర్చుకునేందుకు లేదా బాడీని హైడ్రేట్‌గా ఉంచేందుకు కూల్ డ్రింక్స్ కంటే వివిధ రకాల పండ్ల జ్యూస్‌లు లేదా కొబ్బరి నీళ్లు సేవిస్తే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో అతి ముఖ్యమైంది మస్క్ మెలన్ మిల్క్ షేక్. క్షణాల్లో మీ దాహం తీర్చే అద్భుత పానీయం ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో వాటర్ మెలన్, మస్క్ మెలన్, కీరా, బొప్పాయి వంటివి వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఫ్రూట్స్. వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండాలంటే ఇదే అత్యుత్తమం. ఎంత దాహంగా ఉన్నా ఫ్రూట్ జ్యూస్ లేదా కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మస్క్ మెలన్‌తో మిల్క్ షేక్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ప్రయోజనం కలగడమే కాకుండా క్షణాల్లో మీ దాహం తీరుతుంది. 


మస్క్ మెలన్ అనేది వేసవి సీజనల్ ఫ్రూట్. ఇందులో వాటర్ కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. అందుకే వేసవిలో ఇది బెస్ట్ ఫ్రూట్ అని చెప్పవచ్చు. మస్క్ మెలన్ క్రమం తప్పకుండా సేవిస్తుంటే వేసవిలో శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మస్క్ మెలన్ మిల్క్ షేక్‌తో దాహం తీరడమే కాకుండా ఇన్‌స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. 


మస్క్ మెలన్ మిల్క్ షేక్ తయారు చేసేందుకు 2 మస్క్ మెలన్స్, పుదీనా ఆకులు, కండెన్స్‌డ్ మిల్క్ రెండు గరిటెలు, ఐస్ క్యూబ్స్, జాయ్‌ఫలం పౌడర్ అవసరమౌతాయి. ముందుగా మస్క్ మెలన్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో కండెన్స్‌డ్ మిల్క్, బర్ఫ్, పుదీనా ఆకులు, జాయ్ ఫలం పౌడర్ కలపాలి. అన్నీ కలిపి బ్లెండ్ చేసి షేక్ చేయాలి. అంతే మీక్కావల్సిన మస్క్ మెలన్ మిల్క్ షేక్ సిద్ధం.


Also read: Diabetic Tips: డయాబెటిక్ రోగులు తప్పకుండా తినాల్సిందే, బ్లడ్ షుగర్, మలబద్ధకం రెండూ మాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook