Health Tips: రెడ్ రైస్ వాడకం చాలా తక్కువగా ఉంటుంది. రెడ్ రైస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వైట్ రైస్‌తో పోలిస్తే రెడ్ రైస్‌తో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. మెరుగైన ఆరోగ్యం కోసం వైట్ రైస్ అనేది చాలా మంచిదంటారు. వైట్ రైస్‌తో కలిగే ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. వైట్ రైస్ ఎక్కువగా తినడం వల్ల అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. రెడ్ రైస్‌ను నియమిత మోతాదులో తింటే ఆరోగ్యపరంగా లెక్కలేనన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు. 


రెడ్ రైస్‌లో మోనాకోలిన్ పెద్దమొత్తంలో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించడంలో మోనాకోలిన్ అద్భుతంగా పనిచేస్తుంది. గుండెపోటు వ్యాధుల్నించి రక్షించడంలో రెడ్ రైస్‌లో ఉండే మోనాకోలిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 


రెడ్ రైస్‌లో చాలా కీలకమైన యాంటీ ఆక్సిడెంట్లు గణనీయ సంఖ్యలో ఉంటాయి. సెలేనియం, విటమిన్ సి, బీటా కెరోటిన్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో దోహదపడతాయి. శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. 


రెడ్ రైస్‌లో కాల్షియం, ఫాస్పరస్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల దంతాలు సైతం ఆరోగ్యంగా ఉంటాయి. పళ్లు పటిష్టంగా తయారౌతాయి. ఒకవేళ మీ పళ్లు బలహీనంగా ఉంటే ఇక నుంచి రెడ్ రైస్ వినియోగించడం అలవాటు చేసుకోవాలి. 


రెడ్ రైస్‌లో ఫ్యాట్, కేలరీలు తక్కువగా ఉండటం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. పొట్ట, నడుము చుట్టూ కొవ్వు వేగంగా కరిగిపోతుంది. అందుకే రోజూ రైస్ తినే అలవాటుంటే ఇక నుంచి రెడ్ రైస్ తినడం అలవాటు చేసుకోవాలి.


అన్నింటికీ మించి రెడ్ రైస్ తినడం వల్ల ఇందులో ఉండే అయోడిన్‌తో బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహం రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు రెడ్ రైస్ తినడం అలవాటు చేసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికీ నియంత్రణలో ఉంటాయి.


Also read: Garlic Uses: రోజుకు ఒక వెల్లుల్లి రెమ్మ తింటే చాలు..కొలెస్ట్రాల్ సమూలంగా నిర్మూలన



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook