Cholesterol: ఆధునిక జీవనశైలి కారణంగా ఎదురయ్యే వ్యాధుల్లో ప్రధానమైంది కొలెస్ట్రాల్ సమస్య. ఒక్క కొలెస్ట్రాల్ వివిధ రకాల ఇతర వ్యాధులకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి ప్రమాదకర వ్యాధులు తలెత్తవచ్చు. ఈ క్రమంలో కొలెస్ట్రాల్ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించేందుకు వైద్యులు కూరగాయలు ఎక్కువగా తినమని సూచిస్తుంటారు. ఈ కూరగాయల్లో అతి ముఖ్యమైంది, కొలెస్ట్రాల్ సమస్యను సమర్ధవంతంగా నియంత్రించేది ఆకాకరకాయ. ఆరోగ్యంగా ఉంటూ వివిధ వ్యాధుల్నించి కాపాడుకోవాలంటే ఆహరాపు అలవాట్లు మార్చుకోవాలని వైద్యులు పదే పదే చెబుతుంటారు. ఇందులో భాగంగానే కూరగాయలు తినమని సూచిస్తుంటారు. ప్రత్యేకించి కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉన్నప్పుడు గుండె వ్యాధులు తలెత్తకుండా ఉండేందుకు కొలెస్ట్రాల్ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.


కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రించేందుకు కూరగాయలు తప్పకుండా తినాల్సి ఉంటుంది. ఈ కూరగాయల్లో అతి ముఖ్యమైంది ఆకాకరకాయ. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఆకాకరకాయ నియంత్రణలో అత్యద్భుతంగా పనిచేస్తుంది. ఆకాకరకాయతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాల గురించి విపులంగా తెలుసుకుందాం.


ఆకాకరకాయ అనేది పూర్తి ఆకుపచ్చ రంగులో పైభాగంలో ముళ్లులా ఉంటాయి. ఆకాకరకాయ పూర్తిగా పౌష్థికాహారం నిండి కూరగాయ. ఇందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రుచి కాస్త చేదుగా ఉన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకాకరకాయను డైట్‌లో చేర్చుకుంటే చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు దూరమౌతాయి. 


ఆకాకరకాయలో ఉండే కొన్ని పోషకాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు సహాయపడతాయి. రోజూ ఆకాకరకాయ తింటే బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఆకాకరకాయలో కేలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. వారానికి కనీసం 3 సార్లు ఆకాకరకాయ కూర తింటే ఇందులో పెద్దఎత్తున ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆకాకరకాయలో విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఆకాకరకాయను నిర్ణీత మోతాదులో తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తుంది. ఆకాకరకాయ తినడం వల్ల  ప్రేవులు చాలా అద్భుతంగా శుభ్రమౌతాయి. దాంతో మలబద్ధకం వంటి సమస్యలు ఉత్పన్నం కావు.


Also read: Gut Health: కడుపులో వ్యర్ధాలు తొలగించే అద్భుతమైన మూడు మూలికలు, మరో వంద రోగాలకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook