Diabetes Tips: ఆధునిక జీవన విధానం, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వేగంగా వ్యాపిస్తోంది. మధుమేహం నియంత్రణ ఎంత సులభమో..నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకరం కూడా. అందుకే మధుమేహం వ్యాధిని ఎప్పటికప్పుడు నియంత్రించే చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాలు, మొక్కల్లో మధుమేహాన్ని నియంత్రించగలిగే ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. వీటిని తరచూ తినడం వల్ల రక్తంలో చక్కెర శాతం అస్సలు పెరగదు. దీనికోసం ప్రత్యేకించి కొన్ని మూలికల్ని ఆయుర్వేదశాస్త్రం సూచిస్తోంది. 


నేరేడు గింజలు


నేరేడులో యాంటీ డయాబెటిక్ లక్షణాలు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇందులో ఉండే ఆల్కలాయిడ్స్ రక్తంలో చక్కెరను స్టార్చ్‌గా మారుస్తాయి. అంటే చక్కెర పిండి పదార్ధంగా మారినప్పుడు రక్తంలో చక్కెర పెరగదు. 


మెంతి గింజలు


మధుమేహం నియంత్రణకు మెంతి గింజలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో కూడా యాంటీ బయోటిక్ లక్షణాలు చాలా ఎక్కువ. రాత్రి వేళ మెంతి గింజల్ని నీళ్లలో నానబెట్టి ఉదయం తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.


గుడ్‌మార్ మొక్క


ఇండియాలో దొరికే ఓ దేశీయ మొక్క ఇది. ఇందులో చక్కెర శాతాన్ని తగ్గించే గుణాలుంటాయి. ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కలో ఇన్సులిన్ పెంచే గుణాలున్నాయి. 


లవంగం


లవంగం అనేది ప్రతి ఇంట్లో ఉండేదే. చాలా రకాల వ్యాధుల్ని నయం చేసేందుకు దోహదపడుతుంది. అదే సమయంలో లవంగాల్లోని పోషకాలు ఇన్సులిన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. 


ఎవర్‌గ్రీన్ ఫ్లవర్స్ మొక్క


ఈ మొక్కలు చాలామంది ఇళ్లలో కన్పించేవే. మధుమేహాన్ని తగ్గించేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి పూలను తీసుకోవడం వల్ల ప్యాంక్రియాస్ పనితీరు మెరుగుపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. 


Also read: Hair Fall Reasons: జుట్టు రాలే సమస్యకు 5 ప్రధాన కారణాలివే, ఈ సమస్యకు ఇలా చెక్ చెప్పొచ్చు



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook