Health Tips: ప్రముఖ సెక్స్ స్పెషలిస్టు వైద్యుల ప్రకారం లైంగిక సామర్ధ్యం తగ్గడానికి కారణం లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోవడమే కాకుండా ఆహారపు అలవాట్లు సక్రమంగా లేకపోవడం కూడా. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కూడా అందులోనే ఉందంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో మనిషి ఎదుర్కొంటున్న వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఒకటి లైంగిక సామర్ధ్యం తగ్గిపోవడం. ఈ సమస్య ఎక్కువగా పురుషుల్లో కన్పిస్తుంటుంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లు , జీవనశైలి సరిగ్గా లేకపోవడమే. చాలామంది ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ కొన్ని రకాల ఆహార పదార్ధాల్ని డైట్‌లో చేర్చుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లు, కూరగాయల్లో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.


వీటిలో అతి ముఖ్యమైంది మునక్కాయలు. స్వభావరీత్యా వేడి చేసేవి అయినా ఇందులో పుష్కలంగా ఉండే జింక్ కారణంగా లైంగిక సామర్ధ్యం పెరుగుతుంది. ఇక కాల్షియం, ఐరన్ కారణంగా ఎముకలు పటిష్టంగా ఉంటాయి. లైంగిక కోర్కె, టెస్టోస్టిరోన్ స్థాయిని మునక్కాయ పెంచుతుంది. వారానికి 3-4 సార్లు డైట్‌లో ఉండేట్టు చూసుకంటే లైంగిక సామర్ద్యం పెరుగుతుందంటున్నారు. 


ఇక రెండవది పొట్లకాయలు. చాలామంది పొట్లకాయను ఇష్టపడరు. కానీ ఇందులో ఉండే ప్రత్యేక ఔషధ గుణాల వల్ల చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు దూరమౌతాయి. ఇక మూడవది పొడుగు ఆనపకాయ లేదా సొరకాయ. ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడితో సొరకాయ కూర కలిపి అన్నంతో తింటే మగవారిలో లైంగిక సమస్యలేమైనా ఉంటే దూరమౌతాయి. అయితే క్రమం తప్పకుండా తినాల్సి ఉంటుంది. కేవలం లైంగిక సమస్యలకే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాకుండా శరీరంలో వేడి, కఫం తగ్గుతాయి. 


ఇక మరో ముఖ్యమైన పదార్ధం పచ్చి మిర్చి. వంటల రుచిని పెంచేందుకే కాకుండా శృంగార శక్తి పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే కాస్పియాసిన్ కారణంగా మర్మాంగాల వద్ద అలజడి ప్రారంభమై శృంగార వాంఛ కలుగుతుంది. మరో ముఖ్యమైన పదార్ధం బీట్‌రూట్. డైట్‌లో వారానికి 3 సార్లు ఉండేట్టు చూసుకోవాలి. దీనివల్ల లైంగిక సామర్ధ్యం అద్బుతంగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే వయాగ్రా కంటే మెరుగ్గా పనిచేస్తుందంటారు.


Also read: Healthy lifestyle : నవరాత్రుల్లో ఫాస్టింగ్ చేస్తున్నారా అయితే కచ్చితంగా ఈ ఫ్రూట్ మీకోసమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook