డయాబెటిస్, కొలెస్ట్రాల్ రెండూ ప్రాణాంతకమైనవే. ఒకసారి పట్టుకుంటే ఇక జీవితాంతం వదలవు. నియంత్రణ ఒక్కటే సాధ్యం. ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది. అదే సమయంలో డైట్ కూడా చాలా ముఖ్యం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగానే కొలెస్ట్రాల్, డయాబెటిస్ సమస్య ఉత్పన్నమౌతుంటుంది. వీటిని సకాలంలో నియంత్రించకపోతే ప్రాణాంతకం కాగలవు. కొలెస్ట్రాల్, డయాబెటిస్ నియంత్రణ అనేది పూర్తిగా అలవాట్లపైనే ఉంటుంది. టీ, కాఫీ వంటి అలవాట్లు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో కొన్ని ప్రత్యేకమైన టీలతో కొలెస్ట్రాల్, డయాబెటిస్ నియంత్రించవచ్చు.


గ్రీన్ టీ


గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు దూరమౌతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి వ్యాధుల్ని దూరం చేస్తాయి. గ్రీన్ టీ తాగడం వల్ల ట్రై గ్లిసరాయిడ్స్, కొలెస్ట్రాల్ నియంత్రణలో దోహదపడుతుంది. గ్రీన్ టీ తో అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.


బ్లాక్ టీ


బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. పాలు, పంచదార లేకుండా తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ రోగులు సాధారణంగా టీలు ఎక్కువగా తాగి షుగర్ పెంచుకుంటుంటారు. కానీ షుగర్ , మిల్క్ ఫ్రీ టీ తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. 


క్యామోమైల్ టీ


క్యామోమైల్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నిండుగా ఉంటాయి. పోషక పదార్ధాలతో పుష్కలంగా ఉండే ఈ టీ తాగడం వల్ల వ్యాధులు దూరమౌతాయి. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది. 


వైట్ టీ


వైట్ టీ అనేది కమేలియా సెనేసిస్ ప్లాంట్‌తో తయారౌతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వైట్ టీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వైట్ టీ తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉంటుంది. 


Also read: Weight Loss Diet Plan: ఎలాంటి ఖర్చు లేకుండా 12 రోజుల్లో 3 కిలోల బరువు ఎలా తగ్గాలో తెలుసా..?



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook