High Blood Pressure: ఆధునిక జీవన విధానంలో కన్పిస్తున్న ముఖ్యమైన వ్యాదుల్లో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం ప్రమాదకరమైనవి. రక్తపోటు నియంత్రణలో లేకుంటే అది కాస్తా ప్రాణాంతకమైన గుండెపోటుకు దారి తీయవచ్చు. మరి రక్తపోటును నియంత్రించడం ఎలా..ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక రక్తపోటు కారణంగా శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతుంటాయి. రక్తపోటు నియంత్రణలో ఉన్నంతవరకూ మనిషి అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటాడు. అందుకే దినచర్య, ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండాలి. అప్పుడే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సాధారణమైపోయింది. ఈ సమస్య పెరిగితే హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర సమస్యలకు కారణం కావచ్చు. అటు డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు కూడా రక్తపోటుతో లింక్ అయుంటాయి. అధిక రక్తపోటుకు పని ఒత్తిడి, లైఫ్‌స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు కారణాలు. అందుకే డైట్ మార్చాల్సి ఉంంటుంది. రోజవారీ డైట్‌లో ఈ పండ్లు ఉండేట్టు చూసుకుంటే కచ్చితంగా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు.


మందార పూలతో జ్యూస్ లేదా టీ తయారు చేసుకుని తాగితే రక్తపోటు అద్భుతంగా నియంత్రణలో ఉంటుందంటారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తపోటు సమస్యను దూరం చేస్తాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా ఇతర వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. 


కొబ్బరి నీళ్లు అమృతంలా పనిచేస్తాయి. ఎలాంటి అనారోగ్య సమస్యకైనా కొబ్బరి నీళ్లు మంచి పరిష్కారం. వివిధ రకాల వ్యాధుల సంక్రమణను నివారిస్తాయి. రక్తపోటు బాధితులు రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 


టొమాటో జ్యూస్ క్రమం తప్పకుండా సేవించడం వల్ల విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కావల్సినంతగా లభిస్తాయి. రోజుకు ఒక గ్లాసు టొమాటో జ్యూస్ తాగితే చాలు. గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. 


బీట్‌రూట్‌లో విటమిన్లు, కాల్షియం, ఐరన్ , యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా వివిద వ్యాధుల్నించి కాపాడుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచడమే కాకుండా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. 


ఇక రక్తపోటును నియంత్రించే మరో ముఖ్యమైన ఫ్రూట్ దానిమ్మ. దానిమ్మలో ఉండే విటమిన్లు, ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వివిధ రకాల వ్యాధులు దూరమయ్యేలా చేస్తాయి.


Also read: Hemoglobin: హిమోగ్లోబిన్ లోపిస్తే ఏమౌతుంది, ఎలాంటి పదార్ధాలు తీసుకోవాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook