Pre Diabetes: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధుల్లో ఒకటి మధుమేహం. జాగ్రత్తగా ఉంటే ఎంత సులభంగా నియంత్రణలో ఉంచవచ్చో..నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరం. ఎందుకంటే శరీరంలో డయాబెటిస్ ఉంటే అన్ని వ్యాధులు ఎదురౌతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్‌లో ప్రీ డయాబెటిస్ అనేది ప్రమాదకరమంటున్నారు ఆరోగ్య నిపుణులు. రక్తంలో చక్కెర శాతం సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీ డయాబెటిస్ అంటారు. మధుమేహానికి నిర్ధారిత లెవెల్ అంటూ ఉండదు. అందుకే ప్రీ డయాబెటిక్ స్థితిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మధుమేహం ప్రభావం శరీరంలోని అన్ని అంగాలపై దుష్ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని అంగాలపై నెగెటివ్ ప్రభావం చూపించే స్థితిని ప్రీ డయాబెటిక్ అంటారు. మధుమేహంలో సాధారణంగా నిర్ధారిత స్థాయి ఉండదు. అందుకే ఎప్పుడూ నిర్లక్ష్యం వహించకూడదు. ప్రీ డయాబెటిస్ అనేది ముందస్తు సూచిక. ప్రీ డయాబెటిక్ ప్రమాద తీవ్రత గురించి తెలుసుకుందాం..


ప్రీ డయాబెటిస్, మధుమేహం రెండింట్లోనూ ఆరోగ్యకరమైన సమస్యలున్నాయి. సాధారణ స్థాయి కంటే గంభీరంగా ఉంటుంది. చాలామంది ఈ పరిస్థితిని తేలిక్కా తీసుకుంటారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. సకాలంలో గుర్తించకపోతే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ రోగాలకు దారి తీస్తుంది. ప్రీ డయాబెటిస్ లక్షణాలు సాధారణంగానే ఉంటాయి. అలసట, దాహం వేయడం,  తరచూ మూత్రానికి వెళ్లడం వంటి లక్షణాలుంటాయి. ఈ లక్షణాలు మీలో కన్పిస్తే కచ్చితంగా ప్రీ డయాబెటిక్ అని అర్ధం చేసుకోవచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.


సకాలంలో పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. బ్లడ్ షుగర్ లెవెల్స్ తెలుసుకుంటుండాలి. ఒకవేళ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతుంటే వెంటనే అప్రమత్తం కావల్సి ఉంటుంది. హెల్తీ ఫుడ్ కూడా చాలా అవసరం. అధిక పంచదార, మసాలా పదార్ధాలు తినడం తగ్గించాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, ఫైబర్ పదార్ధాలు తీసుకోవడం మంచిది.


రోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయడం అవసరం. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. బరువు తగ్గించుకోవడం లేదా బరువు నియంత్రణలో ఉంచుకోవాలంటే హెల్తీ ఫుడ్ అనేది చాలా అవసరం. వ్యాయామం అలవాటు చేసుకోవాలి. ఈ సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తుంటే ప్రీ డయాబెటిక్ పరిస్థితిని నివారించవచ్చు. 


Also read: Pregnancy Care: గర్భిణీ మహిళలు దూరంగా ఉండాల్సిన బ్యూటీ కేర్ ఉత్పత్తులు ఇవే, తస్మాత్ జాగ్రత్త



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook