Chest Pain Symptoms: ఛాతీలో నొప్పి సాధారణ లక్షణం కాదు. ప్రతి ఛాతీ లక్షణం హార్ట్ ఎటాక్  కాకపోవచ్చు. ఇతర కారణాలు కూడా లేకపోలేదు. అందుకే ఛాతీ నొప్పి వచ్చినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛాతీలో నొప్పి అంటే సాధారణంగా ఎవరైనా సరే కంగారుపడిపోతుంటారు. ఎందుకంటే హార్ట్ ఎటాక్‌కు ప్రధాన లక్షణం ఇదే. గుండెపోటు విషయంలో అప్రమత్తం అవసరమే కానీ దీని వెనుక కొన్ని ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. సకాలంలో వైద్యుడి వద్దకు వెళ్లి చూపించుకుంటే ఛాతీ నొప్పా కాదా అనేది తేలిపోతుంది. కరోనా సంక్షోభం అనంతరం శరీరంలో కన్పించే వివిధ లక్షణాలు హార్ట్ ఎటాక్ కాకపోవచ్చు. ఛాతీ నొప్పి వచ్చేందుకు ఏయే కారణాలున్నాయి.


పల్మోనరీ ఎంబోలిజం


పల్మోనరీ ఎంబోలిజం అనేది ఓ రకమైన మెడికల్ కండీషన్. దీని కారణంగా ఛాతీ నొప్పి వస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇందులో ఊపిరితిత్తుల వరకూ రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో క్లాట్స్ ఏర్పడతాయి. ఫలితంగా ఊపిరితిత్తుల వరకూ సరిగ్గా రక్తం సరఫరా కాదు. దాంతో ఛాతీలో నొప్పి సమస్య ఏర్పడుతుంది. 


ఛాతీలో ఇన్‌ఫెక్షన్


కరోనా వైరస్ కారణంగా ఊపిరితిత్తులో ఇన్‌ఫెక్షన్ అనేది చాలా ఎక్కువైంది. దాంతో ఛాతీలో నొప్పి సమస్య ఎక్కువైంది. ఊపిరితిత్తుల్లో మరే ఇతర వైరస్ ఎటాక్ చేసినా ఛాతీ నొప్పి తీవ్రమౌతుంది. అందుకే ఛాతీ నొప్పి సమస్యను తేలిగ్గా తీసుకోకూడదు.


కోవిడ్ నిమోనియా


కరోనా వైరస్ రోగులకు ఛాతీలో నొప్పి కారణంగా నిమోనియాకు గురవుతుంటారు. అంటే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కలగడం వల్ల నిమోనియో ముప్పు తలెత్తవచ్చు. దీంతో ఊపిరితిత్తుల ఎయిర్‌బ్యాగ్స్‌లో స్వెల్లింగ్ ఏర్పడుతుంది. క్రమంగా ఛాతీ నొప్పిగా పరిణమిస్తుంది.


ఛాతీ నొప్పికి ఇతర కారణాలివే


పొడి దగ్గు కారణంగా ఛాతీ కండరాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఛాతీ కండరాలు బలహీనంగా ఉండటం వల్ల నొప్పి తరచూ బాధిస్తుంటుంది. అందుకే పొడి దగ్గు త్వరగా తగ్గకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. 


Also read: Kidney Disease Patients: కిడ్నీ పేషెంట్స్‌ ఎలాంటి ఆహారం తినాలంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook