Cholesterol: మన ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యానికి లేదా అనారోగ్యానికి కారణమౌతుంటాయి. కొన్ని రకాల ఆహార పదార్ధాలు బలవర్ధకమైనా ఇతర సమస్యలకు కారణమౌతాయి. కొలెస్ట్రాల్ , మధుమేహం వంటి వ్యాధులకు కారణమయ్యే ఆహార పదార్ధాలు కూడా ఉంటాయి. అందుకే తినే ఆహార పదార్ధాల ఎంపిక చాలా ముఖ్యం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలామంది బ్రేక్‌ఫాస్ట్ రూపంలో ఉడకబెట్టిన గుడ్లను తింటుంటారు. గుడ్లు అంటే ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్ధం. దాంతోపాటు ఇందులో ఉండే నేచురల్ ఫ్యాట్ ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకొక గుడ్డు తినమని వైద్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. అయితే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవాళ్లు గుడ్లు తినవచ్చా లేదా అనేది సందేహంగా మారింది. గుడ్డు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందనే వాదన విన్పిస్తోంది. ఇందులో ఎంతవరకూ నిజముందో తెలుసుకుందాం.


చాలా అధ్యయనాల ప్రకారం గుడ్డులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రకమైన కొలెస్ట్రాల్ శరీరంలో హెల్తీ సెల్స్ నిర్మాణంలో దోహదపడతాయి. ఇందులో శాచ్యురేటెడ్ లేదా ట్రాన్స్ ఫ్యాట్ ఉండకపోవడం వల్ల ఎల్ డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ సమస్య పెరగదు. అయితే ఉడకబెట్టి తింటేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కువ ఆయిల్  లేదా వెన్నలో వండి తింటే నష్టాలే అధికం.


గుడ్డు తినడం వల్ల హెచ్‌డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అందుకే అధిక రక్తపోటు, గుండె వ్యాధుల్నించి కాపాడుతుంది. రోజుకు 2 గుడ్లు తింటే ఆరోగ్యానికి మంచిదంటారు వైద్యులు. రోజుకు 2 గుడ్లకు మించి తినాలంటే వైద్యుని సలహా అవసరం. వర్కవుట్స్ ఎక్కువగా చేసేవారికి ఈ అవసరం రావచ్చు. రోజువారీ జీవితంలో మనం తినే వివిధ రకాల ఆహార పదార్ధాలతోనే కొలెస్ట్రాల్ శాతం విపరీతంగా పెరుగుతుంటుంది. వీటిలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ ఉంటాయి. 


రెడ్ మీట్ అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో ప్రోటీన్లు పెద్ద మొత్తంలో ఉన్నా సరే..ఫ్యాట్ ఉండటం వల్ల మితంగానే తీసుకోవాలి. పాలను కంప్లీట్ ఫుడ్‌గా పిలుస్తారు. కానీ ఫ్యాట్ ఎక్కువగా ఉండే పాలు తాగితే కొలెస్ట్రాల్ స్థాయి పెరిగిపోతుంది. ఒకవేళ తాగాలన్పిస్తే మీగడ పక్కకు జరిపి తాగాలి. చాలా రకాల వంట నూనెలు కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటాయి. కొలెస్ట్రాల్‌కు కారకం కాని వంట నూనెలు వాడితే ఆరోగ్యానికి మంచిది.


Also read: Stress Relief Foods: ఒత్తిడి తగ్గించే 4 ఆహారాలు ఇవే, వీటితో దీర్ఘకాలిక సమస్యలు సైతం దూరం!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook