Constipation: మలబద్ధకం అతి ప్రమాదకరం కానీ ఈ కిచెన్ పదార్ధాలతో సులభంగా చెక్
Constipation: శరీరంలో అంతర్గతంగా ఏర్పడే సమస్యలు వివిధ వ్యాధుల రూపంలో బయటపడుతుంటాయి. ఇందులో ప్రధానమైంది మల బద్ధకం. ఈ సమస్య వినేందుకు ఎంత సాధారణంగా ఉంటుందో అంతే తీవ్రమైంది. అందుకే మలబద్ధకం సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదంటారు.
మలబద్ధకం సమస్య ఉంటే..రోజువారీ జీవితం కష్టమైపోతుంది. వివిధ రకాల అనారోగ్య, ఇతర సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే కిచెన్‌లో లభించే కొన్ని వస్తువులతోనే మలబద్ధకం సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చంటున్నారు.
దేశంలో మలబద్ధకం అనేది ఓ సాధారణ సమస్యగా మారిపోయింది. కారణం ఆయిల్, ఫ్రైడ్ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడమే. అదే సమయంలో ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్స్, తగిన వ్యాయామం లేకపోవడం వంటి ఇతర కారణాలుగా ఉన్నాయి. మలబద్ధకం అనేది వినేందుకు ఎంత సాధారణంగా కన్పిస్తుందో నిర్లక్ష్యం చేస్తే అంతే తీవ్రమైంది. రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగకపోవడం, ఫైబర్ ఆహారం తక్కువగా తినడం వంటివి ప్రధాన కారణాలు. అయితే ఈ సమస్యకు సహజ సిద్ధమైన పద్ధతులతో చెక్ పెట్టవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మలబద్ధకం దూరం చేసే పద్ధతులు
పెరుగు, ఫ్లక్స్ సీడ్స్ పౌడర్
పెరుగు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే బిఫిడోబ్యాక్టీరియమ్ ల్యాక్టిస్ అనే ప్రోబయోటిక్ జీర్ణక్రియను మెరుగుపర్చడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఫ్లెక్స్ సీడ్స్ కలిపితే శరీరానికి కావల్సిన సాల్యుబుల్ ఫైబర్ అద్భుతంగా అందుతుంది. ఫలితంగా మల విసర్దన సులభమౌతుంది.
ఉసరి జ్యూస్
ఉసరి అనేది కేవలం మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కల్గించడమే కాకుండా..చాలా ఇతర సమస్యల్ని కూడా దూరం చేస్తుంది. రోజూ ఉదయం పరగడుపున 30 మిల్లీగ్రాముల ఉసిరి తీసుకుంటే..చాలా సమస్యలకు చెక్ పెట్టినట్టే.
ఓట్ బార్న్
ఓట్ బార్న్‌లో సాల్యుబుల్ , ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండింటి కారణంగా మలబద్ధకం సమస్య దూరమౌతుంది. ఇంటెస్టైనల్ పనితీరు మెరుగుపడుతుంది. అయితే దీనికోసం ఓట్ బార్న్‌ను డైట్‌లో భాగంగా చేసుకోవాలి.
నెయ్యి, పాలు
నెయ్యిలో బ్యాక్టీరిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇంటెస్టైన్ మెటబోలిజంను మెరుగుపరుస్తుంది. మల విసర్జన సులభమయ్యేందుకు తోడ్పడుతుంది. మలబద్ధకం దూరం చేసేందుకు ఒక కప్పు వేడి పాలలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగాలి.
ఆకు కూరలు
ఆకు కూరల్లో ఉండే ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం బ్రోకలీ, పాలకూర, బ్రసెల్స్ స్ప్రౌట్స్ వంటి పదార్ధాలు తీసుకోవాలి. వీటిలో ఫైబర్‌తో పాటు విటమిన్ సి, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇవి ఇంటెస్టైన్ పనితీరును మెరుగుపరుస్తాయి.
నీళ్లు
ప్రతిరోజూ తగిన మోతాదులో అంటే రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగితే మలబద్ధకం సమస్యను దూరం చేయవచ్చు. రోజుకు కావల్సిన నీరు తాగకపోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. అందుకే ఫైబర్ ఫుడ్స్‌తో పాటు ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి.
Also read: Pista Benefits: పిస్తా, పాలు కలిపి తీసుకుంటే..కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook