Dengue Fever: వర్షాకాలం కావడంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా డెంగ్యూ కేసులు గత కొద్దిరోజులుగా పెరిగిపోతున్నాయి. డెంగ్యూ నుంచి కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఐదు రకాల ఆహార పదార్ధాలతో  డెంగ్యూ నుంచి కాపాడుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరద ప్రభావం చాలారోజులుగా నీరు నిల్వ ఉండటంతో డెంగ్యూ కారక ఎడిస్ దోమలు వృద్ధి చెందుతున్నాయి. అటు ఉత్తరాదిలో ఇటు దక్షిణాదిలో రెండు ప్రాంతాల్లోనూ డెంగ్యూ కేసులు అధికమయ్యాయి. అసలు డెంగ్యూు లక్షణాలు ఎలా ఉంటాయి, డెంగ్యూని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ఏం చేయాలనే వివరాలు తెలుసుకుందాం..


డెంగ్యూ లక్షణాలు


తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మజిల్స్, జాయింట్స్ పెయిన్, కంటి వెనుక భాగంలో నొప్పి,  కాళ్లు-చేతుల్లో వాపు, వాంతులు, దురద, అలసట అనేవి డెంగ్యూ వ్యాధిలో కన్పించే ప్రధానమైన లక్షణాలు


అదే సమయంలో  ఒక్కోసారి జ్వరం తగ్గిన తరువాత కూడా కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తం కారడం, మలం, మూత్రం లేదా వాంతిలో రక్తం, చర్మం దిగువ రక్త ప్రసరణ ర్యాషెస్‌లో కన్పించడం, తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, డీహైడ్రేషన్, బద్ధకం, చేతులు-కాళ్లు చల్లబడటం, బరువు వేగంగా తగ్గిపోవడం, చికాకు, అలసట, మానసిక వేదన ఉంటాయి.


ఈ లక్షణాలు కన్పిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే డెంగ్యూ ప్రాణాంతకంగా మారుతుంది. డైట్‌లో కూడా మార్పు చేయాల్సి ఉంటుంది. హెల్తీ డైట్ తీసుకుంటే చాలావరకూ రిలీఫ్ లభిస్తుంది. డెంగ్యూ సోకినప్పుడు ఎలాంటి ఆహారపదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం..


డెంగ్యూ సోకినప్పుడు హెర్బల్ టీ, కాడా తప్పకుండా తాగాలి. కేవలం డెంగ్యూ నివారణకే కాకుండా ఆరోగ్యపరంగా చాలా మంచివి. వీటివల్ల శారీరకంగా, మానసికంగా విశ్రాంతి లభిస్తుంది. ఏదైనా సహజసిద్ధ పదార్ధంతో ఇంట్లోనే హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. ఇక రెండవది పెరుగు తప్పకుండా తినాలి. ఇందులో ఉండే గుడ్ బ్యాక్టీరియా డెంగ్యూ కారక బ్యాక్టిరియా లేదా వైరస్ తో పోరాడేందుకు తోడ్పడుతుంది. పెరుగు తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. 


ఇక కాయగూరల్లో బ్రోకలీ చాలా మంచిదంటారు. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా డెంగ్యూలో ప్రభావం చూపించే ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను గణనీయంగా పెంచుతుంది. డెంగ్యూ సోకినప్పుడు ఎప్పటికప్పుడు ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గకుండా చూసుకోవడం చాలా అవసరం. 


అన్నింటికంటే అద్భుతమైనవి కొబ్బరి నీళ్లు. ఆరోగ్య ఖజానా ఇది. డెంగ్యూ రోగులకు డీహైడ్రేషన్ ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేసేందుకు రోగికి కొబ్బరి నీళ్లు చాలా అవసరం. బలహీనత దూరమవడమే కాకుండా ప్లేట్‌లెట్స్ కౌంట్ పెరిగేందుకు దోహదపడతాయి.


ఇక చివరిగా డెంగ్యూ వ్యాధిలో రామబాణంలా చెప్పుకునేది బొప్పాయి ఆకుల రసం. డెంగ్యూ సోకినప్పుడు ముందుగా ప్రభావం పడేది శరీరంలోని ప్లేట్‌లెట్స్ కౌంట్‌పైనే. బొప్పాయి ఆకుల రసం ఉదయం, రాత్రి రెండుపూటలా 3-4 ఎంఎల్ తాగితే చాలు..ప్లేట్‌లెట్స్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది. 


డెంగ్యూ సోకినప్పుడు ఆ లక్షణాలను తగ్గించేందుకు మందులిస్తారు. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు తరచూ కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు సేవించమని చెబుతారు. అన్నింటికంటే ముఖ్యంగా విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి ఉంటే రోగంతో పోరాడే శక్తి లభిస్తుంది. తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్ తగ్గించేందుకు పెయిన్ కిల్లర్ మందులు వాడుతారు. ఓ వైపు వైద్యులు సూచించిన మందులు వాడుతూనే హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలా త్వరగా డెంగ్యూ నుంచి కోలుకోవచ్చు.


Also read: Vastu Tips for Plants: ఇంట్లో ఈ మొక్కలు ఇలా పెంచితే ఇక ఆ ఇంట్లో నాన్‌స్టాప్ ధన ప్రవాహం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook