Dengue Precautions: వర్షాకాలం వచ్చిదంటే చాలు అనారోగ్య సమస్య భయం మొదలవుతుంటుంది. ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా,, టైఫాయిడ్ జ్వరాల ముప్పు పెరుగుతోంది. మరీ ముఖ్యంగా డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధుల తీవ్రత మరింతగా ఉంది. ఈ క్రమంలో డెంగ్యూ నుంచి ఎలా కాపాడుకోవచ్చో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డెంగ్యూ అనేది ఎడిస్ అనే పగటి పూట కుట్టే దామతో వస్తుంది. సకాలంలో చికిత్స చేయించుకుంటే ఫరవాలేదు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం డెంగ్యూ ప్రమాదకరంగా మారుతుంది. డెంగ్యూ సోకితే  ఫ్లూ వంటి లక్షణాలు, హెవీ టెంపరేచర్, తీవ్రమైన తలనొప్పి, జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్, ర్యాషెస్ కన్పిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే డెంగ్యూ హెమరిక్ ఫీవర్‌గా మారవచ్చు. ఇది ప్రాణాంతకమౌతుంది. డెంగ్యూని నివారించేందుకు, డెంగ్యూ నుంచి కాపాడుకునేందుకు 5 అద్భుతమైన విధానాలున్నాయంటున్నారు..


డెంగ్యూ నివారణలో భాగంగా సామాజిక చైతన్య కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. స్థానికంగా శుభ్రత-పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మస్కిటో బ్రీడింగ్ నిరోధించవచ్చు. మీ చుట్టూ వ్యర్ధ పదార్ధాల మేనేజ్‌మెంట్ పద్దతులు అనుసరించాల్సి ఉంటుంది. అందరూ కలిసి పనిచేస్తే దోమల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు.


మీ ప్రాంతంలో డెంగ్యూ కేసుల పట్ల అప్రమత్తత అవసరం. స్థానిక వైద్య సిబ్బంది సూచించే ఆరోగ్యపరమైన సలహాలు, సూచనలు పాటించాలి. మీక్కూడా డెంగ్యూ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో గుర్తించడం, చికిత్స చేయించడం వల్ల డెంగ్యూను సులభంగా తగ్గించవచ్చు.


దోమలు వృద్ధి చెందే ప్రాంతాల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. దోమలు సాధారణంగా నిల్వ నీటిలోనే వృద్ది చెందుతాయి. అందుకే నీళ్లు ఎక్కువగా నిల్వ లేకుండా చూసుకోవాలి. నీళ్ల ట్యాంకుల్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి.


ఇక వస్త్ర ధారణలో కూడా జాగ్రత్తలు అవసరం. సాధ్యమైనంతవరకూ లాంగ్ స్లీవ్ చొక్కాలు, లాంగ్ ప్యాంట్స్, సాక్స్, షూలు అన్నీధరిస్తే మంచిది. దోమ కాటు నుంచి రక్షించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల దోమలకు చర్మం ఎక్స్ పోజ్ కాకుండా ఉంటుంది. దోమలు సాధారణంగా డార్క్ కలర్స్‌కు ఆకర్షితులౌతాయి. అందుకే లైట్ కలర్ దుస్తులు ధరించాలి. 


డీట్, పైకార్డిన్, లెమన్ యూకలిప్టస్ ఆయిల్ చర్మానికి రాయడం ద్వారా దోమల్నించి దూరంగా ఉండవచ్చు. మస్కిటో రిపెల్లెంట్స్ ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. ఈ పద్ధతి ద్వారా దోమ కాటు నుంచి చాలావరకూ కాపాడుకోవచ్చు. దోమ తెరల్ని కిటికీలకు అమర్చుకోవాలి. పడుకునే మంచం చుట్టూ దోమ తెరల్ని వాడితే మరీ మంచిది.  


మీ చుట్టుపక్కల ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.  పొదలు, చెట్లు చేమలు చెత్త చెదారం పోగుకాకుండా చూసుకోవడం మంచిది. చెత్తను సరైన విధానంలో తొలగించాలి. ఒక చోటి నుంచి తొలగించి మరో చోట డంప్ చేయడం వల్ల ప్రయోజం ఉండదు. ఈ పద్ధతులు పాటించడం వల్ల డెంగ్యూ వ్యాధి ముప్పును సులభంగా తగ్గించవచ్చు. 


Also read: How To Control Diabetes: ఔషధాలు లేకుండా మధుమేహాన్ని ఈ పద్ధతుల్లో నియంత్రించుకోండి!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook