Diabetes in Children: తస్మాత్ జాగ్రత్త, చిన్నారుల్లో పెరుగుతున్న మధుమేహం ముప్పు, జంక్ ఫుడ్స్ కారణమా
Diabetes in Children: ప్రపంచంలో ఎక్కడ చూసినా అతి ప్రమాదకరంగా కన్పిస్తున్న సమస్య మధుమేహం. ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇదే. కేవలం ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వ్యాపిస్తున్న వ్యాధి ఇది. ఇప్పుడీ వ్యాధి చిన్నారుల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Diabetes in Children: ఆధునిక జీవన విధానంలో జంక్ ఫుడ్స్ ముప్పు తీవ్రంగా ఉంటోంది. జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ సమస్యల్లో అతి ముఖ్యమైంది డయాబెటిస్. ఆందోళన చెందాల్సిన అంశమేమంటే ఇప్పుడీ వ్యాధి చిన్నారుల్లో కూడా ఎక్కువగా కన్పిస్తోంది.
టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా చిన్నారుల్లో కూడా మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జంక్ పుడ్స్‌లో సహజంగానే అధిక కేలరీలు, ఎక్కువ షుగర్, అనారోగ్యకరమైన కొవ్వు, లో న్యూట్రిషన్ ఉంటుంది. ఫలితంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితి టైప్ 2 డయాబెటిస్‌కు కారణమౌతుంది. మొన్నటి వరకూ మధ్య లేదా అధిక వయస్సు వారిలో ఎక్కువగా కన్పిస్తూ ఉన్న టైప్ 2 డయాబెటిస్ ఇప్పుడు చిన్నారుల్లో ఎక్కువగా కన్పిస్తోంది. జంక్ ఫుడ్ వినియోగం ఎక్కువ కావడంతో టైప్ 2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో చిన్న పిల్లల్లో ఎక్కువగా ఈ వ్యాధి కన్పిస్తోంది.
జంక్ పుడ్స్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. శరీరంలోని రక్తంలో చక్కర శాతాన్ని బ్యాలెన్స్ చేసేందుకు పాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ డయాబెటిస్ ఉంటే ఇది సాధ్యం కాదు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారిలో ఈ పరిస్థితి కన్పిస్తుంది. చిన్నారుల్లో స్థూలకాయం పెరుగుతుండటంతో టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీలో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఇండియాలో హైపర్ టెన్షన్ బాధితులు 315 మిలియన్లు ఉన్నారు. ఇక డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు 101 మిలియన్లు ఉన్నారు.
వివిధ అధ్యయనాల ప్రకారం ఇండియాలో 136 మిలియన్ల మంది ప్రీ డయాబెటిక్ పరిస్థితిలో ఉంటే 213 మిలియన్ల మందికి అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంది. 185 మిలియన్ల మందికి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. అటు 254 మిలియన్ల మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. 351 మిలియన్ల మంది బానకడుపుతో ఉన్నారు.
చిన్నారుల్లో టైప్ 2 డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి 12-18 ఏళ్ల వయస్సులో వారికి ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అధికశాతం స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో ఈ సమస్య కన్పిస్తోంది. అల్ట్రా ప్రోసెస్డ్ జంక్ ఫుడ్స్ అదే పనిగా తినడం వల్ల స్థూలకాయం పెరుగుతోంది. అదే సమయంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతున్ననాయి. ఫలితంగా టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది.
Also read: Fiber Benefits: శరీరానికి ఫైబర్ ఎందుకు అవసరం, ఫైబర్‌తో కలిగే ప్రయోజనాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook