ప్రతిరోజూ ఉదయం పరగడుపున టీతో రస్క్ తినడమంటే చాలామందికి ఇష్టమే. కొంతమంది ఇతర సమయాల్లో సైతం తింటుంటారు. కానీ ఈ అలవాటు ఏ మాత్రం మంచిది కాదు. మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రస్క్ తినడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రస్క్ రిఫైండ్ పిండితో తయారౌతుంది. ఇందులో పంచదార అధికంగా ఉంటుంది. అంతేకాదు రస్క్ తయారీలో ఉపయోగించే నూనె కూడా నాణ్యమైంది ఉండదు. అందుకే ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. రస్క్‌లో రిఫైండ్ గోధుమ పిండి లేదా మైదా ఉపయోగిస్తారు. దాంతోపాటు ఇందులో నూక, రిఫైండ్ ఎడిబుల్ ఆయిల్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, ఫుడ్ ఎడిక్టివ్స్, ప్రిజర్వేటివ్స్ వంటివి కలుస్తాయి. ఇవి కచ్చితంగా ఆరోగ్యానికి మంచివి కావు. అందుకే రోజుకు కేవలం రెండు రస్కులు తిన్నా ఆరోగ్యానికి మంచిది కానే కాదు. 


రస్క్ తినడం వల్ల కలిగే దుష్పరిణామాలు 


టీతో పాటు టోస్ట్ తినడం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇందులో రోగాల్ని పెంచే కారకాలుంటాయి. ముఖ్యంగా గుండె వ్యాధి ముప్పు పెరుగుతుంది. 


మీకు రోజూ టీ, రస్క్ తినే అలవాటుంటే ఇవాళే మానుకోండి. ఎందుకంటే దీనివల్ల ప్రేవుల్లో అల్సర్ సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్, జీర్ణం సరిగ్గా లేకపోవడం వంటి ఇతర సమస్యలు ఉత్పన్నమౌతాయి.


Also read: Cholesterol: చలికాలంలో పొరపాటున కూడా ఇవి తినొద్దు, కొలెస్ట్రాల్ వేగంగా పెరిగే ప్రమాదం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook