Thyroid Diet: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో అతి ముఖ్యమైంది థైరాయిడ్. థైరాయిడ్ కారణంగా చాలారకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఎందుకంటే శరీరంలోని వివిధ రకాల పనుల్ని నియంత్రించేది థైరాయిడ్ నే. అందుకే థైరాయడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరంలో అంతర్గతంగా ఏదైనా సమస్య తలెత్తిందంటే అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంటుంది. అంటే తరచూ మనకు ఎదురయ్యే జ్వరాలు, వివిధ రకాల నొప్పులు, అలసట, నీరసం వంటివి సాధారణంగా వచ్చేవి కావు. శరీరంలో అంతర్గతంగా సమస్య తలెత్తితే కన్పించే లక్షణాలే. ఆ లక్షణాల్ని బట్టి సమస్య ఏంటనేది గుర్తించగలిగితే సకాలంలో చికిత్స సాధ్యమౌతుంది. అదే విధంగా థైరాయిడ్ సమస్యను కూడా సకాలంలో గుర్తించగలగాలి. థైరాయిడ్ అనేది ఓ గ్రంధి. మనిషి శరీరంలో మెడ భాగంలో లోపల సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. మనిషి శరీరానికి అవసరమైన హార్మోన్ల విడుదల ఈ గ్రంథి చేసే పని. ఈ గ్రంథిలో సమస్య ఏర్పడితే హార్మోన్ల విడుదలపై ప్రభావం పడి..వివిధ రకాల సమస్యలు ఏర్పడతాయి. 


సాధారణంగా థైరాయిడ్ సమస్య ఉంటే శరీరం పనితీరు కూడా ప్రభావితమౌతుంది. ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకుంటే థైరాయిడ్ గ్రంథిలో తలెత్తే సమస్యను సరిచేయవచ్చు. అంటే థైరాయిడ్ సమస్యను దూరం చేయవచ్చు. థైరాయిడ్ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏయే పదార్ధాలు తీసుకోవాలో, ఏవి తీసుకోకూడదో తెలుసుకుందాం..


యాపిల్‌లో ఉండే పేక్టిన్ అనే ఫైబర్ థైరాయిడ్ హార్మోన్‌ను సమతుల్యం చేయడంలో దోహదపడుతుంది. రోజూ యాపిల్ తినడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. ధైరాయిడ్ సమస్యకు చెక్ చెప్పాలంటే మరో అద్భుతమైన ఆహారం బ్రౌన్ రైస్. ఇందులో ఆరోగ్యానికి అవసరమైన సెలేనియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. 


డ్రై ఫ్రూట్స్ కూడా థైరాయిడ్ సమస్యకు మంచి పరిష్కారం. బాదం, వాల్ నట్స్, బ్రెజిల్ నట్స్ వంటివి వారంలో కనీసం 4-5 సార్లు తీసుకుంటే థైరాయిడ్ వంటి సమస్యల్ని దూరం చేయవచ్చు. పెరుగులో ఉండే ప్రో బయోటిక్స్ ప్రేవుల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే సమయంలో థైరాయిడ్ సమస్యను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.


ఏవి తినకూడదు


కాలిఫ్లవర్, బ్రోకలి, అరటి వంటి క్రూసిఫెరోస్ కూరగాయలకు థైరాయిడ్ రోగులు దూరంగా ఉండాలి. ఇవి థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతాయి. అందుకే మీ డైట్‌లో ఇవి లేకుండా చూసుకోవాలి. గ్లూటెన్ అనేది థైరాయిడ్ సమస్యను పెంచుతుంది. అందుకే గ్లూటెన్ ఉండే పదార్ధాలను డైట్‌కు దూరంగా ఉంచడం మంచిది. రోజూ నిర్ణీత సమయంలో వ్యాయామం చేయడమే కాకుండా ఒత్తిడి లేని జీవనశైలిని అలవర్చుకోవాలి. 


Also read: Ajwain Water: సర్వ రోగ నివారిణి, బెస్ట్ డీటాక్స్ డ్రింక్, రోజూ పరగడుపు తాగితే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook