Body Pain Causes: శరీరంలోని కొన్ని భాగాల్లో అప్పడప్పుడూ నొప్పి సమస్య తలెత్తుతుంటుంది. చాలామంది ఈ నొప్పుల్ని తేలిగ్గా తీసుకుంటుంటారు. ఈ నొప్పులు అదే పనిగా దీర్ఘకాలం కొనసాగుతుంటే మాత్రం తీవ్రంగానే పరిగణించాల్సిన అవసరముంటుంది. అందుకే ప్రతి నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనకు తరచూ తలనొప్పి, కాళ్ల నొప్పులు, తిమ్మిరెక్కడం, మోకాలి నొప్పులు, దురద ఇలా వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పులు వస్తుంటాయి. సాధారణంగా ఈ నొప్పుల్ని తేలిగ్గా తీసుకుని వదిలేస్తుంటాం. చాలా సందర్భాల్లో ఈ నొప్పులు సాధారణమే కావచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం సీరియస్ కావచ్చు. నొప్పి సమస్య ఎక్కువకాలం వేధిస్తుంటే..రక్త నాళికల ద్వారా శరీరంలో ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేదని అర్ధం చేసుకోవాలి. శరీరంలో ఆక్సిజన్ సరఫరా లోపమేర్పడితే ఏయే భాగాల్లో నొప్పి ఉంటుందో తెలుసుకుందాం..


శరీరంలోని ఏయే భాగాల్లో నొప్పి ఉంటుంది


ఒకవేళ మీకు కడుపులో తరచూ నొప్పిగా ఉండటంతో పాటు వాంతులు రావడం, కడుపులో తిప్పినట్టుండటం వంటి లక్షణాలు కన్పిస్తే ఇది ప్యాంక్రియోటైటిస్ లక్షణాల్లో ఒకటి. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.


ఒకవేళ తలనొప్పితో పాటు తీవ్ర అలసట, విసుగు, డిప్రెషన్ వంటి లక్షణాలు బాధిస్తుంటే..నాడీ వ్యవస్థలో సమస్య లేదా మైగ్రెయిన్ కావచ్చు. ఈ పరిస్థితుల్లో లక్షణాల్ని తక్షణం గుర్తించి వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.


ఒకవేళ ఛాతీలో నొప్పి అదే పనిగా బాధిస్తూ చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంటే అలక్ష్యం చేయకూడదు. ఇది హార్ట్ ఎటాక్ ముప్పుకు కారణం కావచ్చు. రక్తం ద్వారా ఆక్సిజన్ గుండె వరకూ చేరనప్పుడు ఇలా జరుగుతుంటుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.


ఒకవేళ కిడ్నీలో నొప్పి చాలా కాలంగా ఉంటే మీ కిడ్నీలో రాళ్లున్నాయని అర్ధం చేసుకోవాలి. ఒకే చోట నొప్పి రావడం కిడ్నీలో రాళ్ల సమస్యకు కారణం కావచ్చు. మీ కాళ్లలో నొప్పితో పాటు చేతులు కాళ్లు తిమ్మిరెక్కినట్టుండటం వంటి సమస్యలుంటే...సయాటికా లక్షణం కావచ్చు. తగిన పరీక్షలు చేయించుకోవాలి.


Also read: Green Tea: గ్రీన్ టీ ఏ సమయంలో తాగితే మంచిది, లేకపోతే ఆ ప్రమాదముందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook