Diabetes Tips: మధుమేహ నియంత్రణ పూర్తిగా మన చేతుల్లో ఉన్నదే. కానీ కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గవు. ఈ పరిస్థితుల్లో కొన్ని చిట్కాలు ఆచరించడం వల్ల సరైన ఫలితాలుంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. డయాబెటిస్ నియంత్రించగలిగే ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా మనిషి ఎదుర్కొనే వివిధ వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది డయాబెటిస్. ఈ వ్యాధి పట్ల ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా చాలా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షించుకుంటూ ఉండాలి. లేకపోతే ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఒక్కోసారి హఠాత్తుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. డయాబెటిస్ కారణంగా ఇతర చాలా వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే హెల్తీ ఫుడ్ తినడం, జీవనశైలి మెరుగుపర్చుకోవడం చాలా అవసరం. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా జీవనశైలి సరిగ్గా ఉండటం లేదు. అందుకే డయాబెటిస్ సోకిందంటే చాలు హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయామం అలవర్చుకోవడం ప్రారంభించాల్సి ఉంటుంది. 


మధుమేహం వ్యాధి గ్రస్థులకు రాత్రి భోజనం అనేది చాలా కీలకమైందిగా పరిగణిస్తారు. రాత్రి వేళ హెల్తీ ఫుడ్ తీసుకున్న తరువాత ఓ పని తప్పకుండా చేయాలి. ప్రతి రోజూ రాత్రి డిన్నర్ తరువాత కనీసం 10-15 నిమిషాలు లైట్ వాకింగ్ అవసరం. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేస్తే కొన్నిరోజుల్లోనే మంచి ఫలితాలు కన్పిస్తాయి.


భారతీయులకు సాధారణంగా ఆయిలీ, స్వీట్ ఫుడ్స్ అంటే మక్కువ ఎక్కువ. ఫలితంగా కొలెస్ట్రాల్, డయాబెటిస్, హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువౌతుంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులు ఈ తరహా ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. హెల్టీ డైట్ ఏం తీసుకోవాలనేది ఎవరైనా డైటిషియన్‌ను సంప్రదించి తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.


ఆధునిక జీవన విధానంలో పనిలో పడి బిజీగా మారి భోజనం కూడా మానేస్తుంటాం. కానీ ఆకలిగా ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది. అందుకే ఏ మాత్రం కొద్దిగా ఆకలేసినా పండ్లు, శెనగలు, సలాడ్ వంటి హెల్తీ స్నాక్స్ తినాలనే సలహా ఇస్తుంటారు వైద్యులు. ఆకలిని నిర్లక్ష్యం చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండవు.


Also read: Health Drink: రోజూ ఉదయం ఈ టీ తాగితే చాలు చర్మానికి నిగారింపు, అధిక బరువుకు చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook