Nutrition Deficiency: సృష్టిలోని సకల చరాచర జీవుల్లో మనిషి ఒకడు. పురుషులు, మహిళలు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. పురుషులతో పోలిస్తే మహిళల ఆరోగ్యం సాధారణంగా బలహీనంగానే ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీనకపోవడం, మహిళలు తరచూ ఎదుర్కొనే నెలసరి కూడా ఇందుకు కారణం కావచ్చు. మహిళలు ఎదుర్కొనే పోషకాల లోపం గురించి పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐరన్ లోపం అనేది సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఐరన్ అంటే ఎర్ర రక్తకణాలు సమూహం. హిమోగ్లోబిన్‌గా పిలుస్తారు. శరీరంలోని వివిధ కణజాలాలకు ఆక్సిజన్ అందిస్తుంది. మహిళల నెలసరి సమస్య వల్ల రక్తహీనత ప్రధానంగా ఉంటుంది. దీనివల్ల అలసట, ఇమ్యూనిటీ బలహీనంగా ఉండటం, తలనొప్పి, మైకం, మెదడు పనితీరు సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలుంటాయి.


ఐరన్ లోపం సరిచేసేందుకు రెడ్ మీట్, రాజ్మా , కాయధాన్యాలు, గుమ్మడికాయ గింజలు, నువ్వులు, జీడిపప్పు మరియు బచ్చలికూర వంటి ముదురు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. 


ఇక రెండవది విటమిన్ డి లోపం. విటమిన్ డి ని సన్ షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. కారణం సూర్యరశ్మి నుంచి పుష్కలంగా లభిస్తుంది.  ఆరోగ్యకరమైన కేశాలు, ఆరోగ్యకరమైన ఎముకలు, సంతానోత్పత్తి, హార్మోన్ల ఆరోగ్యానికి ఇది అవసరం. విటమిన్-డి లోపంతో కండరాలు, ఎముకల బలహీనత ఏర్పడుతుంది. విటమిన్ డి లోపముంటే ఎముకల్లో పగుళ్లు వచ్చే ప్రమాదం ఉంది. విటమిన్ డి కోసం సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ చేపలు, గుడ్డు సొన, సహజ సూర్యకాంతి సరైన ప్రత్యామ్నాయాలు. 


మూడవది కాల్షియం లోపం. కాల్షియం శరీరంలో అధికంగా లభించే ఖనిజం. ఇది ఎముకలు, దంతాలను పటిష్టంగా ఉంచుతుంది. కణాంతర సిగ్నలింగ్, న్యూరోట్రాన్స్మిషన్, కండరాల సంకోచం, పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్‌లో రక్షణాత్మక పాత్ర ఉంటుంది. కాల్షియం లోపంతో బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది, పాల ఆహారాలు, బాదం, బీన్స్, ముదురు ఆకుపచ్చ కూరగాయల్లో ఎక్కువగా లభిస్తుంది.


ఇక నాలుగవది విటమిన్-బి12 లోపం. నాడి పనితీరు, ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు, బి 12 అవసరం. ఈ విటమిన్ జంతు ఉత్పత్తులలో మాత్రమే కనిపిస్తుంది. ఆహారంలో తగినంత బి12 లేకపోవడం వల్ల యాసిడ్-బ్లాకర్ మందులు తీసుకునేవారిలో, చిన్న ప్రేగులలో మంట ఉన్నవారిలో సమస్య ఏర్పడుతుంది. సాల్మన్ చేపలు, రెడ్ మీట్, గుడ్లలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. 


ఇక ఐదవది ప్రోటీన్ లోపం. చర్మం, గోర్లు ప్రోటీన్లతో తయారౌతాయి. ముఖ్యంగా శరీరంలో అత్యుత్తమ హార్మోన్ల సృష్టికి ప్రోటీన్లు అత్యవసరం. ఫలితంగా మంచి పనితీరు, ఉత్పాదకత లభిస్తుంది. చిక్కుళ్ళు, గుడ్లు, కాటేజ్ చీజ్, పెరుగు, చికెన్, చేపలు, కాయలు, విత్తనాల్లో పుష్కలంగా అందుతాయి.


ఇక ఆరవది మెగ్నీషియం లోపం. మెగ్నీషియం అనేది ఎంజైమాటిక్ ప్రతిచర్యలలో పాల్గొంటుంది. ఎముకల ప్రధాన భాగం, కణ త్వచాలలో ఒక భాగం. మృదువైన కండరాలు, సంకోచంతో పాటు కండరాల సడలింపును సులభతరం చేస్తుంది. కండరాల తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది. అసాధారణ గుండె లయ, కండరాల తిమ్మిరి, వణుకు,  అలసట, మైగ్రేన్ వ్యక్తిత్వ మార్పులు మెగ్నీషియం లోపంతో ఏర్పడుతుంది. మెగ్నీషియం కోసం బీన్స్, కాయలు, నువ్వులు, గుమ్మడికాయ, పొద్దుతిరుగుడు విత్తనాలు మంచి ప్రత్యామ్నాయాలు.


ఇక ఏడవది అయోడిన్ లోపం. అయోడిన్ అనేది థైరాయిడ్ పనితీరుని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన ఒక ట్రేస్. థైరాయిడ్ లోపముంటే.. పిండం , పెరుగుదలను దెబ్బతీస్తుంది. అయోడిన్ లోపం తీర్చేందుకు స్ట్రాబెర్రీలు, గుడ్లు, చేపలు, పాల ఉత్పత్తులు, బంగాళదుంపలు అవసరమౌతాయి.


Also read: Fatty Liver Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా, ఈ పదార్ధాలు డైట్‌లో చేర్చండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook