Earbuds Usage: ఇటీవలి కాలంలో చాలామంది నిద్రించేటప్పుడు మొబైల్ ఫోన్ విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఇయర్ ఫోన్స్ లేదా బ్లూటూత్ బడ్స్ చెవిలో పెట్టుకుని ఫోన్ చూస్తూ నిద్రపోతుంటారు. ఈ అలవాట ఆరోగ్యంపై కచ్చితంగా దుష్ప్రభావం చూపిస్తుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజూవారీ జీవితంలో అలవర్చుకునే వివిధ రకాల అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ఇందులో ఒకటి రాత్రి వేళ నిద్రపోయేటప్పుడు చెవిలో ఇయర్ బడ్స్ పెట్టుకుని మొబైల్ చూస్తూ ఉండిపోవడం. అప్పుడప్పుడూ ఇలా చేస్తే ఫరవాలేదు కానీ రోజూ ఇదే పనిగా అలవాటు చేసుకుంటే మాత్రం దుష్ప్రభావం పడుతుంది. అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. రాత్రంతా చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకుని ఫోన్ చూస్తూ నిద్రపోవడం లేదా రాత్రంతా అలా వింటూ ఉంటుంటే చెవుల సామర్ధ్యం తగ్గిపోతుంది. చెవి నొప్పి సమస్య వెంటాడుతుంది. అందుకే ఇలాంటి అలవాటు ఉంటే దూరం చేసుకోవాలి


ఇటీవలి కాలంలో గ్యాడ్జెట్స్ వినిమయం అధికమౌతోంది. ఇది మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందని చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారు. కొంతమంది ఇంట్లోంచి బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లో బడ్స్ పెట్టుకుని పాటలు వింటుంటారు. ఇది మీ స్ట్రెస్ లెవల్‌ను పెంచుతుంది. అదే పనిగా చెవుల్లో పెట్టుకుని తిరుగుతుంటే చెవుల్లో బీప్ సౌండ్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యకు పరిష్కారం ఏదీ లేదు.


చెవుల్లో వ్యాక్స్ ఏర్పడటం ఓ ప్రాకృతిక సమస్య. ఒకవేళ ఎవరైనా 24 గంటలూ అదే పనిగా చెవుల్లో ఇయర్ బడ్స్ వాడుతుంటే చెవుల్లో ఏర్పడే వ్యాక్స్ లోపలకు పోతుంది. ఇది చాలా ప్రమాదకరం. అంతేకాకుండా చెవుల్లో దురద, నొప్పి మొదలౌతాయి.


Also read: Monsoon Health Care: వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ వ్యాధులు తప్పవు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook