Health Tips: పరగడుపున ఏయే పదార్ధాలు తినవచ్చు, ఏవి తినకూడదు

Health Tips: మనిషి ఆరోగ్యం అనేది ఎప్పుుడూ ఆహారపు అలవాట్లు, జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుంది. ఏయే ఆహార పదార్ధాలు ఎప్పుడు సేవించాలనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే లేని సమస్యలు కొనితెచ్చుకున్నట్టవుతుంది.
Health Tips: ఆధునిక పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగులెత్తే జీవన విధానంలో ఆహారపు అలవాట్లు, వేళలు కూడా మారిపోయాయి. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే ఆహారం విషయంలో వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వీటిని పాటిస్తే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.
జీవనశైలి, ఆహరాపు అలవాట్లు బాగుంచే ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. అంటే ఎలాంటి ఆహారం ఎప్పుడు తినాలనేది తప్పకుండా తెలుసుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్ధాలను ఉదయం వేళ పరగడుపున తీసుకుంటే చాలా మంచిది. అదే సమయంలో కొన్ని పదార్ధాలను ఉదయం పరగడుపున తీసుకుంటే మంచిది కానేకాదు. ఎలాంటి ఆహారం ఎప్పుడు తినాలనేది పరిశీలించుకోవాలి. లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరగడుపున అన్ని రకాల ఆహార పదార్ధాలు సేవించకూడదంటారు వైద్యులు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చాలామంది మసాలా పదార్ధాలు, ప్యాక్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడాన్ని ఇష్టపడుతుంటారు. కానీ ఇది మంచి అలవాటు కానే కాదు. వీటివల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. ఫైబర్ పదార్ధాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్ధాలు తీసుకోవాలి. ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.
ఇక మరో ముఖ్యమైంది బెడ్ కాఫీ లేదా బెడ్ టీ అలవాటు. నిద్ర నుంచి లేవగానే బ్రష్ కూడా చేయకుండా పరగడుపున కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఇది అస్సలు మంచి అలవాటు కాదు. దనివల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. కానీ చల్లని నీల్లు అస్సలు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం అత్యుత్తమం.
పరగడుపున లేచిన వెంటనే మద్యం తాగడం మరీ ప్రమాదకరం. ఇది నేరుగా లివర్‌పై ప్రభావం చూపిస్తుంది. మీ రక్తంలో ఆల్కహాల్ వేగంగా వ్యాపించి..సమస్యలకు కారణమౌతుంది. ఇక జీవనశైలిలో వ్యాయామం లేదా వాకింగ్ భాగంగా చేసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook