Green Tea: గ్రీన్ టీ ప్రయోజనాలేంటి, ఎప్పుడెప్పుడు తాగాలి, ఎప్పుడు తాగకూడదు
Green Tea: సాధారణంగా ప్రతి ఒక్కరిటీ టీ లేదా కాఫీ తాగే అభిరుచి ఉంటుంది. టీ, కాఫీల వల్ల ఆరోగ్యపరంగా ఏ ప్రయోజనాలున్నాయో లేదో తెలియదు గానీ గ్రీన్ టీతో మాత్రం అద్బుత లాభాలున్నాయి. ఆ వివరాలు పూర్తిగా మీ కోసం.
Green Tea: గ్రీన్ టీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ పరగడుపున తాగితే కలిగే ప్రయోజనాలు లెక్కకు మించి అంటారు ఆరోగ్య నిపుణులు. ఆయితే గ్రీన్ టీ విషయంలో కొన్ని సూచనలున్నాయంటున్నారు. గ్రీన్ టీ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదని..ఓ నిర్ణీత సమయముంటుందంటున్నారు. గ్రీన్ టీ ప్రయోజనాలు, ఎప్పుడు తాగితే మంచిదో తెలుసుకుందాం..
అటు ఆయుర్వేదపరంగా ఇటు వైద్యపరంగా గ్రీన్ టీకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఎందుకంటే గ్రీన్ టీ తో ఆరోగ్యపరమైన లాభాలు చాలా చాలా ఉన్నాయి. గ్రీన్ టీ ప్రయోజనాల విషయంలో అందరికీ అవగాహన కూడా పెరగడంతో గ్రీన్ టీ సేవించేవాళ్లు కూడా అధికమయ్యారు. బ్లడ్ షుగర్ నియంత్రణ, అధిక బరువు నియంత్రణ ఇలా చాలా ప్రయోజనాలున్నాయి. గ్రీన్ టీతో రోజు ప్రారంభిస్తే..ఆ రోజంతా ఆరోగ్యంగా, ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. రోజూ ఉదయం పరగడుపు తాగితే నిజంగా ఓ హెల్త్ డ్రింక్‌లా పనిచేస్తుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండటమే కాకుండా..మెదడు పనితీరు వేగవంతమౌతుంది.
గ్రీన్ టీ రోజూ తాగే అలవాటుంటే అధిక బరువు నుంచి నియంత్రణ పొందవచ్చు. గ్రీన్ టీను ఓ నెలరోజులు తాగితే కచ్చితంగా బెల్లీ ఫ్యాట్ సమస్య పోతుంది. అదే సమయంలో గ్రీన్ టీతో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. గ్రీన్ టీతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. న్యూరో సమస్యలతో ఇబ్బందిపడేవారికి గ్రీన్ టీ అద్భుతమైన డ్రింక్. రోజుకు 2-3 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. గ్రీన్ టీ తాగడం వల్ల ఎముకలకు బలం కలుగుతుంది. దీంతో ఓస్టియోపోరోసిస్, ఓస్టియోపేనియా వంటి వ్యాధుల్నించి ఉపశమనం పొందవచ్చు.
అయితే గ్రీన్ టీ ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదంటారు. రోజూ పరగడుపున గ్రీన్ తాగితే అందులో ఉండే కెఫీన్, టానిన్ కారణంగా జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. అదే విధంగా పడుకునేముందు కూడా గ్రీన్ టీ సేవించకూడదు. ఇది నిద్రలేమికి కారణమౌతుంది. రోజుకు 2 కప్పులకు మించి గ్రీన్ టీ తాగితే శరీరంపై కచ్చితంగా దుష్ప్రభావం చూపిస్తుందంటున్నారు. గ్రీన్ టీ తాగాలంటే భోజనానికి అరగంట ముందు, భోజనానికి రెండు గంటల తరువాత మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also read: Fennel Seeds For Weight Loss: సోంపు నీటితో సులభంగా బరువు తగ్గడం ఎలాగో తెలుసా? ఇలా 10 రోజుల్లో చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook