Kidney Failure Signs: కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంతవరకూ శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. సాదారణంగా కిడ్నీల ఆరోగ్యం అనేది ఆహారపు అలవాట్లు, జీవనశైలిని బట్టి ఉంటుంది. ఆధునిక జీవన విధానంలో బిజీ లైఫ్ కారణంగా జీవనశైలి చెడి..కిడ్నీల సమస్యకు దారి తీస్తుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీరంలో కిడ్నీలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శరీరంలోని మలినాలను తొలగించే పని చేస్తుంది. శరీరాన్ని సక్రమంగా పనిచేసేట్టు చేయడంలో కిడ్నీల పాత్ర అత్యంత కీలకం. ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ప్రధానంగా కిడ్నీల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంటుంది. అందుకే సాధ్యమైనంతవరకూ బయటి తిండికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినకూడదు. సాధ్యమైనంతవరకూ పండ్లు, ఆకు కూరలు ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తుంటారు. కిడ్నీల్లో సమస్య ఏర్పడినా లేదా కిడ్నీలు పాడవుతున్నా శరీరంలో కొన్ని లక్షణాల ద్వారా తెలిసిపోతుంది. ఆ లక్షణాలేంటో పరిశీలిద్దాం.


కిడ్నీలు శరీరంలో అతి ముఖ్యమైన భాగం. ఇందులో ఏమైనా సమస్య ఏర్పడితే ముందుగా విపరీతమైన అలసట, బలహీనత ప్రధాన లక్షణంగా కన్పిస్తుంది. ఏ పనీ చేయకుండానే అలసట కన్పిస్తుంటుంది. కిడ్నీలు దెబ్బతింటే కన్పించే మరో ప్రధాన లక్షణం దురద ఎక్కువగా ఉండటం. శరీరంలోని వివిధ భాగాల్లో రెడ్‌నెస్ కన్పిస్తుందియ చర్మం డ్రైగా మారుతుంది. దురద కారణంగా చర్మంపై ర్యాషెస్ ఏర్పడవచ్చు.


కిడ్నీలు పాడయితే కన్పించే అతి ముఖ్యమైన లక్షణం తరచూ మూత్రం రావడం. పదే పదే మూత్రానికి వెళ్తున్నా లేదా మూత్ర విసర్జన సమయంలో మంట ఉన్నా కిడ్నీలు సరిగ్గా లేవని అర్ధం. తక్షణం వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. శరీరంలో స్వెల్లింగ్ కూడా ఓ సంకేతం కావచ్చు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 


కిడ్నీలు పాడయితే ఆకలి మందగిస్తుంది. ఏం తిన్నా తినకపోయినా సహించదు. వాంతులు లేదా వికారం సమస్య ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే ఈ లక్షణం కన్పిస్తుంది. ఈ లక్షణాలు కన్పించినప్పుడు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా తక్షణం వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరు నెలలకోసారి సీరమ్ క్రియేటిన్ పరీక్ష చేయించుకుని అప్రమత్తంగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 


Also read: Get Periods Early: ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌ సమస్యకు చెక్‌ పెట్టండి ఇలా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook