Health Tips: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రెండు విషయాలు తప్పకుండా పాటించాలి. ఒకటి రోజూ తగిన మోతాదులో నీళ్లు తాగడం, రెండవది సరిపడినంత నిద్ర పోవడం. ఈ రెండింట్లో ఏది తగ్గినా వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషికే కాదు సృష్టిలోని ప్రతి జీవరాశి మనుగడకు నీళ్లు తప్పకుండా ఉండాల్సిందే. చాలామందికి నీళ్లు ఎంత తాగాలనే సందేహం ఉంటుంది. మహిళలతో సమానంగా పురుషులు నీళ్లు తాగాలా వద్దా అనే సందేహం ఉంటుంది. సులభంగా చెప్పాలంటే దాహం వేసిన ప్రతి సారీ తప్పకుండా నీళ్లు తాగాల్సిందే. అయితే రోజుకు ఎంత నీరు తాగాలనేది కూడా వివరణ ఉంది. రోజుకు 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాల్సి ఉంటుంది. దీనివల్ల జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. చర్మం బిగుతుగా, కాంతివంతంగా ఉంటుంది. అన్నింటికీ మించి ఆరోగ్యంగా ఉంటుంది. 


నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ప్రకారం మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీళ్లు, పురుషులు 3.7 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. అయితే ఏదైనా ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మాత్రం అనారోగ్యానికి దారి తీయవచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ుండే కూరగాయలు, పండ్లు కూడా తీసుకోవచ్చు. టీ, కాఫీ, పాలు వంటి పానీయాల్ని వాటర్ సప్లిమెంట్లుగా పరిగణించవచ్చంటారు కొందరు. బ్రిటీషు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకారం రోజుకు 6-8 గ్లాసుల నీళ్లు తాగాలని సిఫారసు ఉంది. 


గ్యాస్, హార్ట్ బర్న్ సమస్య తగ్గించుకునేందుకు, జీర్ణక్రియ, జీవక్రియ మెరుగ్గా ఉండేందుకు, చర్మం హైడ్రేట్‌గా ఉండేందుకు రోజూ తగిన పరిమాణంలో నీళ్లు తాగాలి. చాలామంది చలికాలం అనేసరికి నీళ్లు తాగడంలో అలసత్వం ప్రదర్శిస్తుంటారు. ఇది డీ హైడ్రేషన్‌కు దారి తీస్తుంటుంది. అందుకే సీజన్‌తో సంబంధం లేకుండా రోజుకు 7-8 గ్లాసుల నీళ్లు తప్పకుండా తీసుకోవాలి. 


Also read: Weight Loss Tips: రోజూ ఈ పదార్ధం తీసుకుంటే అధిక బరువు సహా అన్నింటికీ చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook