Walking Tips: మనిషి శరీరంలో శారీరక శ్రమ తగ్గే కొద్దీ వివిధ రకాల వ్యాధులు సోకుతున్నాయి. ఇటీవలి జీవనశైలిలో శారీరక శ్రమకు ఆస్కారం లేకుండా పోవడంతో మధుమేహం, రక్తపోటు, గుండె వ్యాధులు వంటి సమస్యలు తలెత్తతున్నాయి. వీటి నుంచి రక్షించుకోవాలంటే వాకింగ్ అనేది అత్యవసరం. అయితే వాకింగ్ ఉదయం చేస్తే మంచిదా లేక సాయంత్రం చేస్తే మంచిదా అనే సందేహం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు, ఫిట్ అండ్ హెల్తీగా ఉండటానికి వివిధ రకాల పోషకాలే కాదు శారీరక శ్రమ కూడా అవసరం. అందుకే వాకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వివిధ రకాల అధ్యయనాల ప్రకారం వేర్వేరు సమయాల్లో చేసే వాకింగ్‌కు ప్రయోజనాలు కూడా అలానే వేర్వేరుగా ఉంటాయి. అంటే మార్నింగ్ వాకింగ్ ప్రయోజనాలు, ఈవెనింగ్ వాక్ ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి.


ఉదయం వేళ లేత ఎండలో వాకింగ్ లేదా సాయంత్రం చల్లగాలిలోవాకింగ్ రెండూ ప్రత్యేకమే. రెండింటి వల్ల ఆరోగ్యానికి ప్రయోజనముంటుంది. అయితే రెండింట్లో దేని ద్వారా ఎక్కువ లాభాలు కలుగుతాయనేదే అసలు ప్రశ్న. మార్నింగ్ వాకింగ్ వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డి సంపూర్ణంగా లభిస్తుంది. ఇది ఇమ్యూనిటీ పటిష్టం చేసేందుకు, ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతే కాకుండా శరీరం మెటబోలిజం వేగవంతమౌతుంది. ఫలితంగా కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి. 


మార్నింగ్ వాకింగ్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. అంటే స్లీప్ సైకిల్ మెరుగుపడుతుంది. ఉదయం వాకింగ్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ముఖ్యంగా ఒత్తిడి దూరమౌతుంది. రోజంతా ఎనర్జెటిక్‌‌గా ఉంటారు. దాంతోపాటు ఉదయం వేళ ఉండే ప్రశాంతమైన, స్వచ్ఛమైన గాలి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు లాభదాయకం. అయితే శీతాకాలంలో మాత్రం మార్నింగ్ వాకింగ్ కాస్త ఇబ్బంది కల్గిస్తుంది. చలిగాలుల కారణంగా కీళ్ల నొప్పులు పెరుగుతాయి.


ఇక ఈవెనింగ్ వాక్ వల్ల రోజందా ఉండే అలసట, ఒత్తిడి దూరం చేయవచ్చు.శరీరంలోని కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. రాత్రి నిద్రించేముందు కాస్త వాకింగ్ చేయడం అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రాత్రి వేళ ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అయితే ఈవెనింగ్ వాక్ వల్ల కాలుష్యం బారిన పడే ప్రమాదం లేకపోలేదు. ఈవెనింగ్ వాక్ చేసి అలసిపోవడం వల్ల సహజంగానే ఆకలి ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంతవరకూ మార్నింగ్ వాక్ అనేదే ఆరోగ్యానికి మంచిది. 


Also read: Pomegranate Benefits: రోజూ పరగడుపున దానిమ్మ తింటే ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook