White lung Pneumonia: ఇటీవలి కాలంలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అధికమౌతున్నాయి. ఇందులో వైట్ లంగ్ నిమోనియా ఒకటి. ఈ సమస్య గురించి అప్రమత్తంగా లేకుంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. అందుకే వైట్ లంగ్ నిమోనియా లక్షణాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన విధానంలో వైట్ లంగ్ నిమోనియా తరచూ కన్పిస్తున్న వ్యాధి. రోజువారీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ వ్యాధి వైరల్, బ్యాక్టీరియల్, కెమికల్ కారణాలతో సోకుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు ఛెస్ట్ ఎక్స్ రే తీస్తే ఊపిరితిత్తులు నల్లగా కన్పిస్తాయి. అంటే ఊపిరితిత్తుల్లో పూర్తిగా గాలి నిండుకుందని అర్ధం. ఇంకొంతభాగం ఫ్లూయిడ్స్‌తో నిండిపోతుంది. ఇది పలు సమస్యలకు కారణమౌతుంది. అసలు వైట్ లంగ్ నిమోనియా లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.


వైట్ లంగ్ నిమోనియా లక్షణాలు


శృతి మించిన దగ్గు, దగ్గుతో పాటు రక్తం కారడమం, పసుపు లేదా పచ్చగా కఫం రావడం కన్పిస్తుంది. శరీరం నుంచి చెమట్లు పడుతుంటాయి. శరీరం చల్లబడిపోతుంది. తేలిగ్గా జ్వరం ఉంటుంది. అలసట, బలహీనత ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. చికాకు, మనశ్శాంతి లేకుండా ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. వయస్సుపైబడినవారిలో అయితే మానసిక పరిస్థితి సరిగ్గా ఉండకపోవచ్చు. వాంతులు రావడం, వాంతులు వచ్చినట్టుండటం ఉంటుంది. 


ఈ లక్షణాలు మీలో కన్పిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే చికిత్స లేకపోతే సమస్య మరింత జటిలం కావచ్చు. వైట్ లంగ్ నిమోనియా సాధారణంగా ఫ్లూ, కోవిడ్ 19, మైక్రోప్లాస్మా నిమోనియా, స్ట్రెప్టోకోకస్ నిమోనియాకు దారి తీయవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు మాస్క్ ధరించడం, శుభ్రంగా ఉండటం, చేతులు తరచూ శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. స్మోకింగ్ మానేయాలి.


Also read: Food Causes Cancer: క్యాన్సర్ ముప్పును పెంచే ఈ అలవాట్లను ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook