Zinc Importance: శరీరంలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ అవసరం ఎప్పుడూ ఉంటుంది. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా అవసరమైన విటమిన్లు, మినరల్స్ పొందగలుగుతున్నాం. అదే విధంగా జింక్ అవసరం ఉంటుంది. అసలు జింక్ అవసరమేంటి, జింక్ లోపాన్ని సరిచేసుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి శరీర నిర్మాణంలో జింక్ పాత్ర చాలా కీలకం. శరీరంలో వివిధ అవయవాల పనితీరు మెరుగుపర్చేందుకు జింక్ దోహదపడుతుంది. అంటే శరీరంలో చాలా రకాల ప్రక్రియలు జింక్ ద్వారానే జరుగుతాయి. అంటే రోగ నిరోధక శక్తి పెరగడం, గాయం మానడం, డీఎన్ఏ సింథెసిస్, ప్రోటీన్ మెటబోలిజం ముఖ్యమైనవి. అందుకే జింక్ లోపం ఏర్పడితే చాలా రకాల సమస్యలు ఉత్పన్నమౌతాయి. 


జింక్ లోపముంటే తలెత్తే సమస్యలు


శరీరంలో జింక్ తగినంతగా లేకపోతే ఇమ్యూనిటీ బలహీనమౌతుంది. దాంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు త్వరగా చుట్టుముడుతుంటాయి. గాయాలు త్వరగా మానవు. చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. జుట్టు రాలడం ప్రధానంగా కన్పిస్తుంది. న్యూరోలాజికల్ డిజార్డర్ రావచ్చు. మానసిక ఆరోగ్యం కూడా జింక్‌పైనే ఆధారపడి ఉంటుంది. 


జింక్ లోపం తలెత్తకుండా ఉండాలంటే హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. ముఖ్యంగా జింక్ అధికంగా ఉండే పదార్ధాలను డైట్‌లో ఉండేట్టు చూసుకోవాలి. ఆనపకాయ విత్తనాలు తినడం వల్ల జింక్ లోపం సరిచేయవచ్చు. ఇందులో జింక్‌తో పాటు ఫైబర్, ప్రోటీన్లు, న్యూట్రిషన్లు ఉంటాయి. 100 గ్రాముల ఆనపకాయ విత్తనాల్లో దాదాపుగా 7.64 గ్రాముల జింక్ ఉంటుంది.


జింక్ పుష్కలంగా ఉండే మరో ఆహారం పాలకూర. ప్రతి 100 గ్రాముల పాలకూరలో 0.79 గ్రాముల జింక్ ఉంటుంది. అందుకే జింక్ లోపమున్నప్పుడు పాలకూర, ఆనపకాయ విత్తనాలు సరైన ప్రత్యామ్నాయాలుగా చెప్పవచ్చు. ఈ రెంటితో పాటు మటన్, పెరుగులో కూడా జింక్ కావల్సినంత లభిస్తుంది. వారంలో రెండుసార్లు మటర్ తినడం మంచి అలవాటుగా చెబుతారు. శరీరానికి అవసరమైన ఎనర్జీ కూడా లభిస్తుంది. శాకాహారులైతే మటన్ స్థానంలో జీడిపప్పు, శెనగలు డైట్‌లో చేర్చుకోవాలి. అదే విధంగా పెరుగు తప్పనిసరిగా డైట్‌లో ఉండాలి. 100 గ్రాముల పెరుగులో 1.03 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది. జీర్ణ సంబంధ సమస్యలు కూడా దూరమౌతాయి. మెటబోలిజం వేగవంతమౌతుంది. 


సీ ఫుడ్ కూడా జింక్ లోపాన్ని సరిచేసేందుకు మరో ప్రత్యామ్నాయం. ఆయిస్టర్ వంటి చేపల్లో ఎక్కువ మోతాదులో జింక్ ఉంటుంది. 1 గ్రాము చేపలోనే 78.6 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది. దాంతోపాటు ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. 


Also read: IMD Weather Alert: రానున్న 48 గంటల్లో భారీ మంచు, మోస్తరు వర్షసూచన, ఏయే రాష్ట్రాల్లో అంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook