ఇటీవలి కాలంలో ఛాతీలో నొప్పి అనేది సర్వ సాధారణమైపోయింది. ఛాతీలో నొప్పికి కారణాలు అనేకం కావడంతో చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదే కొంప ముంచుతుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛాతీలో నొప్పి ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఈ సమస్య తరచూ అదే పనిగా వస్తుంటే పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది ఈ సమస్యను ఎసిడిటీ అనుకుని నిర్లక్ష్యం చేస్తారు. తరచూ ఈ సమస్య వస్తుంటే ఆరోగ్యానికి హాని చేకూరుతుంది. ఛాతీలో తరచూ మంటగా ఉంటే..ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఆ కారణాలేంటో తెలుసుకుందాం..


ఛాతీలో మంటకు కారణాలు


చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఛాతీలో మంట సమస్య ఏర్పడుతుంది. కాఫీ, టొమాటో, ఆల్కహాల్, మసాలా తిండి తినే అలవాటుంటే..ఈ సమస్య తప్పదు. ఛాతీలో మంటగా ఉంటే వెంటనే ఈ పండ్లను దూరం చేయాలి.


ధూమపానం


ఒకవేళ మీకు స్మోకింగ్ అలవాటు ఉంటే..ఛాతీలో మంట ఎక్కువౌతుంది. సిగరెట్ పొగ ప్రభావం ఛాతీపై పడనుంది. ఛాతీలో మంట, నొప్పి సమస్యలు ఎదురౌతాయి.


ఒత్తిడి


ఒత్తిడి, ఆందోళన కారణంగా ఛాతీలో మంట పెరుగుతుంది. ఒత్తిడి కారణంగా ప్యానిక్ ఎటాక్ ముప్పు పొంచి ఉంటుంది. హార్ట్ ఎటాక్‌కు కారణం కావచ్చు. ఈ పరిస్థితుల్లో ఛాతీలో నొప్పి, మంట వస్తుంది.


హార్మోన్స్


హార్మోన్స్ పెరగడం వల్ల ఛాతీలో మంట తలెత్తుతుంది. ఒకవేళ శరీరంలో ప్రోజెస్టెరోన్ వంటి హార్మోన్ పెరుగుదల కారణం కావచ్చు. ఛాతీలో మంట ఎదురౌతుంది.


Also read: Fat Lose Tips: నిమ్మతొక్కతో కూడా ఇలా సులభంగా 7 రోజుల్లో అధిక బరువుకు చెక్‌..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook